తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kinetic Luna Electric : ఎలక్ట్రిక్​ అవతారంలో తిరిగొస్తున్న కైనెటిక్​ లూనా!

Kinetic Luna electric : ఎలక్ట్రిక్​ అవతారంలో తిరిగొస్తున్న కైనెటిక్​ లూనా!

27 December 2022, 10:34 IST

    • Kinetic Luna electric moped : దేశ మొబిలిటీ సెగ్మెంట్​లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి.. కనుమరుగైన కైనెటిక్​ లూనా మోపెడ్​, మళ్లీ తిరిగొస్తోంది! ఈసారి ఎలక్ట్రిక్​ వర్షెన్​లో రాబోతోంది. కైనెటిక్​ లూనా ఎలక్ట్రిక్​ మోపెడ్​కు సంబంధించిన వివరాలను ఆ సంస్థ తాజాగా వెల్లడించింది.
ఎలక్ట్రిక్​ అవతారంలో తిరిగొస్తున్న కైనెటిక్​ లూనా!
ఎలక్ట్రిక్​ అవతారంలో తిరిగొస్తున్న కైనెటిక్​ లూనా!

ఎలక్ట్రిక్​ అవతారంలో తిరిగొస్తున్న కైనెటిక్​ లూనా!

Kinetic Luna electric moped : ఇండియా మొబిలిటీ సెగ్మెంట్​లో విప్లవాత్మక మార్పులు సృష్టించిన కైనెటిక్​ లూనా గుర్తుందా? ఈ టూ వీలర్​ మోపెడ్​.. ఇప్పుడు మళ్లీ దేశ రోడ్ల మీద చక్కర్లు కొట్టడానికి సిద్ధమవుతోంది! ఎలక్ట్రిక్​ వర్షెన్​తో ఈ లూనాను తీసుకొస్తున్నట్టు కైనెటిక్​ ఇంజినీరింగ్​ లిమిటెడ్​ (కేఈఎల్​)​ ప్రకటించింది. అతి త్వరలోనే మార్కెట్​లోకి ఈ కైనెటిక్​ లూనా ఎలక్ట్రిక్​ మోపెడ్​ను లాంచ్​ చేయనున్నట్టు వెల్లడించింది. కైనెటిక్​ గ్రీన్​ ఎనర్జీ అండ్​ పవర్​ సొల్యూషన్స్​ ద్వారా ఈ మోపెడ్​ను విక్రయించనున్నట్టు పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

కైనెటిక్​ లూనా ఎలక్ట్రిక్​ వర్షెన్​..

మెయిన్​ ఛాసీస్​, మెయిన్​ స్టాండ్​, సైడ్​ స్టాండ్​, స్వింగ్​ ఆర్మ్​తో పాటు ఇతర పార్ట్​లను ఇప్పటికే సిద్ధం చేసినట్టు కేఈఎల్​ చెబుతోంది. మహారాష్ట్ర అహ్మెద్​నగర్​లోని ఫ్యాక్టరీలో ఈ కైనెటిక్​ లూనా ఎలక్ట్రిక్​ మోపెడ్​ ప్రొడక్షన్​ జరుగుతుందని స్పష్టం చేసింది. నెలకు 5వేల యూనిట్ల వరకు మోపెడ్​లను తయారు చేసే సామర్థ్యం ఈ మేన్యుఫ్యాక్చరింగ్​ ఫెసిలిటీకి ఉందమని పేర్కొంది.

Kinetic Luna electric moped price : ఈ తరం వారికి కైనెటిక్​ లూనా గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో కైనెటిక్​ లూనాకు విపరీతమైన డిమాండ్​ ఉండేది. ఎక్కడ చూసినా ఇవే కనిపించేవి. ముఖ్యంగా.. గ్రామాల్లో ఎక్కువ మంది దీనినే ఉపయోగించే వారు. ఫలితంగా రోజుకు 2వేలకుపైగా యూనిట్లు అమ్ముడుపోయిన సందర్భాలు కూడా ఉన్నట్టు సంస్థ చెబుతోంది. ఇక ఇప్పుడు.. కైనెటిక్​ లూనా ఎలక్ట్రిక్​ వర్షెన్​కి కూడా మంచి డిమాండ్​ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఆ సంస్థ.

"వచ్చే 2-3 ఏళ్లల్లో.. కైనెటిక్​ లూనా ఎలక్ట్రిక్​ బిజినెస్​తో వార్షికంగా రూ. 30కోట్ల ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాము. దీని ద్వారా.. ఈవీ సెగ్మెంట్​లో కేఈఎల్​ మార్కెట్​ షేర్​ కూడా పెరుగుతంది," అని సంస్థ మేనేజింగ్​ డైరక్టర్​ ఆజిక్య ఫిరోడియా వెల్లడించారు.

Kinetic Luna electric moped launch date in India : కైనెటిక్​ లూనా ఎలక్ట్రిక్​ మోపెడ్​కు సంబంధించిన వివరాలను రెగ్యులేటరీ ఫైలింగ్​లో పొందుపరిచింది కేఈఎల్​. దేశంలో ఈవీకి ప్రస్తుతం ఉన్న డిమాండ్​కు తగ్గట్టే ఈ మోపెడ్​ను రూపొందిస్తున్నట్టు పేర్కొంది. దిగువ శ్రేణి మార్కెట్​లు, లోడ్​ కారియర్​ కేటగిరీని ఈ కైనెటిక్​ లూనా ఎలక్ట్రిక్​ మోపెడ్​ టార్గెట్​ చేస్తుందని వివరించింది.

అయితే.. ఈ కైనెటిక్​ లూనా ఎలక్ట్రిక్​ మోపెడ్​కు సంబంధించిన ఫీచర్స్​, ధర, బ్యాటరీ ప్యాక్​ వంటి వివరాలను కేఈఎల్​ ఇంకా ప్రకటించలేదు. ఈ కైనెటిక్​ లూనా ఎలక్ట్రిక్​ మోపెడ్​ లాంచ్​ డేట్​ను కూడా రివీల్​ చేయలేదు. కాగా.. రానున్న రోజుల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం