Honda electric moped : హోండా ఎలక్ట్రిక్ 'మోపెడ్' వచ్చేస్తోంది!
Honda electric moped : హోండా నుంచి ఓ ఎలక్ట్రిక్ మోపెడ్ వస్తోంది. ఈ ఏడాది చివర్లో దీనిపై హోండా అప్డేట్ ఇవ్వొచ్చు!
Honda electric moped : మోటర్ సైకిల్ టెక్నాలజీలో హోండా.. దిగ్గజ సంస్థగా ఎదిగింది. కానీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో మాత్రం వేగంగా అడుగులు వేయలేకపోయింది. ఇక ఇప్పుడు.. ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఉన్న అవకాశాలను గ్రహించిన హోండా.. స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే మోటర్ సైకిళ్లకు ఎలక్ట్రిక్ వర్షెన్‌ను ఇచ్చేందుకు సన్నద్ధమైంది. ఇప్పటి నుంచి 2025 వరకు 10కిపైగా కొత్త ఎలక్ట్రిక్ మోడల్స్‌ను లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రచించింది.
ఈ 10 కొత్త ఎలక్ట్రిక్ హోండాలు స్కూటర్లు, మోపెడ్లు, ఎలక్ట్రికల్లీ అసిస్టెడ్ బైసైకిళ్ల మోడల్స్‌లో ఉండనున్నాయి. అయితే.. ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో.. స్పీడ్ కన్నా సేల్స్ సంఖ్యపై హోండా ఎక్కువ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
Honda electric moped news : కాగా.. హోండా ఎలక్ట్రిక్ మోపెడ్ డిజైన్‌కు సంబంధించిన ఫైలింగ్ ఒకటి యూరోప్‌లో వెలుగులోకి వచ్చింది. 50సీసీ ఉండే హోండా మెలోడీని ఈ డిజైన్ పోలి ఉంది. కాగా.. ఇందులో పెడల్స్‌ను ఎక్స్ట్రాగా పెట్టారు. కొండ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ పవర్ సరిపోకపోతే.. పెడల్స్‌ని కూడా ఉపయోగించుకునే విధంగా రూపొందించింది హోండా.
హోండాకు మోపెడ్ సెగ్మెంట్లో పీఏ50 హాబిట్, పుచ్ మ్యాక్సీ వంటి మోడల్స్ ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు.. హోండా ఎలక్ట్రిక్ మోపెడ్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధపడింది.
Honda electric moped design : వాస్తవానికి.. పెడల్స్‌తో కూడిన మోపెడ్లు మార్కెట్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే.. వీటికి ఎలక్ట్రిక్ వర్షెన్‌ను జత చేస్తే.. మార్కెట్లో ఎగ్జైట్మెంట్ ఉంటుందని హోండా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. డిజైన్ని చూస్తే.. ప్రతిసారీ పెడల్స్‌ను వినియోగించాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. ఫుట్‌బోర్డ్ మీద కాళ్లు పెట్టుకోవచ్చు. ఎలక్ట్రిక్ మోపెడ్‌లో అవసరమైతేనే పెడల్స్‌ని వాడుకోవాల్సి ఉంటుంది! హబ్ మౌంటెడ్ మోటార్ డిజైన్‌లో ఈ కొత్త మోపెడ్ ఉన్నట్టు డిజైన్ ద్వారా కనిపిస్తోంది.
వేగం ఎంత ఉంటుందో..!
యూరోప్‌లో పెడల్స్‌తో కూడిన బైసైకిళ్లు 15.5ఎంపీహెచ్ వేగంతో మాత్రమే వెళతాయి. వీటికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్ష్యూరెన్స్ వంటివి అవసరం లేదు. అయితే.. హోండా మాత్రం ఎలక్ట్రిక్ మోపెడ్ ప్రదర్శనపై మరింత దృష్టిసారించినట్టు, వేగాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ప్రస్తుతానికి ఇది యూరోప్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. యూరోప్ నిబంధనల ప్రకారం.. 28ఎంపీహెచ్ వేగం దాటితే.. మోప్డలకు రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. డ్రైవర్‌కు లైసెన్స్ ఉండాలి. మరి దీని వేగం ఎంత ఉంటుందనేది రానున్న కాలంలో హోండా నుంచి స్పష్టత రావాల్సింది. అయితే.. డిజైన్‌లో నెంబర్ ప్లేట్ కోసం ఖాళీ ఉండటం గమనార్హం.
10 ఎలక్ట్రిక్ బైక్స్‌లో ఒకదానిని ఈ ఏడాది చివర్లో హోండా ఆవిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం