Ola S1 new variant : హోండా యాక్టివాకు పోటీగా ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!
Ola S1 new variant : రూ. 80వేల కన్నా తక్కువ ధరకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చేందుకు ఓలా ప్రయత్నిస్తోంది. ఇది హోండా యాక్టివ్‌కు పోటీనిచ్చే అవకాశం ఉంది.
Ola S1 new variant : ఓలా ఎలక్ట్రిక్.. కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో ఇది మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కాగా.. ఇది ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు కొత్త వేరియంట్ అని సమాచారం. ఇది.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా యాక్టివాకు బలమైన పోటీని ఇస్తుందని తెలుస్తోంది.
కొత్త వేరియంట్ ధర రూ.80వేలు!
ప్రస్తుతం ఇండియాలో ఓలా నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు(ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో) మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఓలా ఎస్1 కొత్త వేరియంట్.. సంస్థకు చెందిన చౌకైన వాహనంగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి. దీని ధర రూ.80,000 కన్నా తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.
Ola S1 new variant vs Honda Activa : ఈ కొత్త వేరియంట్‌తో.. ఎలక్ట్రిక్ రంగంలోనే కాకుండా.. పెట్రోల్ వాహనాల తయారీ సంస్థలకు సైతం బలమైన సవాళ్లు విసిరేందుకు ఓలా సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా హోండా యాక్టివాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీని ధర రూ.70,000- రూ.80,000 మధ్యలో ఉంటుంది. మార్కెట్ అంచనాలకు తగ్గట్టే ఓలా ఎస్1 కొత్త వేరియంట్ ధర ఉంటే.. యాక్టివాకు కచ్చితంగా పోటీ పెరుగుతుంది.
ఈ ఏడాది ఆగస్టులో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది ఓలా ఎస్1. ఒక్కాసారి ఛార్జ్ చేస్తే.. 141కి.మీల దూరం ప్రయాణిచవచ్చు. స్పోర్ట్స్ మోడల్లో అయితే 90కి.మీలు వెళ్లొచ్చు. రెడ్, జెట్ బ్లాక్, ప్రొక్లైన్ వైట్, నియో మింట్, లిక్విడ్ సిల్వర్‌లో ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది.
Ola S1 electric : నివేదికల ప్రకారం.. ఓలా ఎస్1 కొత్త వేరియంట్ డిజైన్‌లో మార్పులు జరగవచ్చు. కొత్త సస్పెన్షన్ ఉండొచ్చు. ఓలాకు చెందిన మూవ్ఓఎస్ ఇందులో ఉంటుంది.
అక్టోబర్ 22న కీలక ప్రకటన చేస్తామని ఓలా ఇప్పటికే చెప్పింది. మూవ్ఓఎస్ 3ని ఆ ఈవెంట్లో ప్రకటించే అవకాశం ఉంది. మరి ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్ గురించి ఏమైనా అప్డేట్ వస్తుందా లేదా అన్న చూడాలి.
ఓలా ఎస్1 ప్రోపై భారీ ఆఫర్లు..!
Ola S1 pro offers : మరోవైపు ఓలా ఎస్1 ప్రోపై పండుగ ఆఫర్లు నడుస్తున్నాయి. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 1.40లక్షలు. రూ. 10వేల డిస్కౌంట్‌తో దీనిని పొందవచ్చు. 5 ఇయర్ వారెంటీపై రూ. 1500 డిస్కౌంట్ ఇస్తోంది ఓలా. లోన్ మీద ప్రాసెసింగ్ ఫీజును 0 చేసింది ఓలా సంస్థ.
సంబంధిత కథనం