తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How To Take Care Of New Car : కొత్తగా కారు కొన్నారా? ఈ తప్పులు చేస్తే.. ఇక అంతే!

How to take care of new car : కొత్తగా కారు కొన్నారా? ఈ తప్పులు చేస్తే.. ఇక అంతే!

Sharath Chitturi HT Telugu

25 June 2023, 20:20 IST

    • How to take care of new car : మీరు కొత్తగా కారు కొన్నారా? లేదా కొత్త కారు తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. కొత్త కారును చూసుకునేందుకు కొన్ని టిప్స్​ తెలుసుకోవాలి. అవేంటంటే..
కొత్తగా కారు కొన్నారా? ఈ తప్పులు చేస్తే.. ఇక అంతే!
కొత్తగా కారు కొన్నారా? ఈ తప్పులు చేస్తే.. ఇక అంతే!

కొత్తగా కారు కొన్నారా? ఈ తప్పులు చేస్తే.. ఇక అంతే!

How to take care of new car : సొంత కారు కొనడటం అంటే చాలా మందికి ఓ కల. అందుకోసం చాలా కష్టపడి కారు కొంటారు. కానీ కొన్న తర్వాత ఆ కారును పట్టించుకోరు! ఇది సరైనది కాదు. బిడ్డ పుట్టిన తర్వాత పట్టించుకోకపోతే ఏమవుతుంది? కారుకు కూడా అంతే. కారును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో.. కొత్త కారు కొన్న తర్వాత చేయాల్సినవి ఏంటి? చేయకూడనివి ఏంటి? వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాము..

యూజర్​ మేన్యువల్​ చదవాలి..

కారు కొన్న తర్వాత చాలా పనులు చేస్తాము. కానీ యూజర్​ మేన్యువల్​ని మాత్రం పట్టించుకోము. అసలు అది అనవసరమైన బుక్​గాను, మనకి అన్ని తెలుసు అన్నట్టుగాను ప్రవర్తిస్తాము. కానీ అది తప్పు. సంబంధిత కారు మోడల్​కు సంబంధించిన పూర్తి విషయాలు యూజర్​ మేన్యువల్​లో ఉంటాయి. ఏం చేయాలి? ఏం చేయకూడదు? వంటి వివరాలు అందులో ఉంటాయి. కాస్త సమయం తీసుకుని వాటిని చూస్తే.. కారును ఎలా చూసుకోవాలో అర్థమవుతుంది.

కారును లాంగ్​ డ్రైవ్​కు తీసుకెళ్లండి..

కారులో అలా లాంగ్​ డ్రైవ్​కు వెళితే ఆ ఫీలే వేరు కదా! ఇది మనకే కాదు.. కారుకు కూడా రిఫ్రెషన్​మెంట్​ను ఇస్తుంది. అంటే కొత్త బండిని లాంగ్​ డ్రైవ్​కు తీసుకెళితే దాని పార్ట్స్​ కాస్త ఫ్లెక్సిబుల్​ అవుతాయి. అందుకే.. షార్ట్​ ట్రిప్స్​తో పాటు ఓ లాంగ్​ ట్రిప్​కి కూడా ప్లాన్​ చేయండి. సూపర్​ ఫీల్​ ఉంటుంది..!

ఇదీ చూడండి:- Car loan interest rate : తక్కువ వడ్డీకి కారు లోన్​ తీసుకోవాలా? ఈ బ్యాంక్​లు ఇస్తాయి..!

యాక్సలేటర్​, బ్రేక్​.. జాగ్రత్త!

కొత్త కారు కొని.. ఆ స్పీడ్​ను ఎంజాయ్​ చేయాలని చాలా మందికి ఉంటుంది. అందుకే.. ఇష్టమొచ్చినట్టు యాక్సలరేటర్​ను తొక్కి స్పీడ్​ పెంచుతారు. కానీ ఇలా చేయకూడదు. వాస్తవానికి కారు కొన్న మొదట్లోనే కాదు.. ఎప్పుడూ కూడా యాక్సలరేటర్​ను ఎక్కువగా ప్రెస్​ చేయకూడదు. కనీసం 1000- 1,500కి.మీల వరకైనా యాక్సలరేటర్​తో స్మూత్​గా ఉండాలి.

బ్రేక్స్​ విషయంలోనూ ఇంతే! మాటిమాటికి బ్రేక్​ వేయడం కూడా మంచిది కాదు. ఇది ఫ్యూయెల్​ ఎఫీషియెన్సీపై పెద్ద ప్రభావమే చూపిస్తుంది. ఏదైనా స్మూత్​గా చేసుకుంటూ వెళ్లిపోవాలి. అప్పుడే మీ కొత్త కారులో రైడ్​ కూడా స్మూత్​గా, ఎలాంటి అవరోధాలు లేకుండా సాగిపోతుంది!

కారును తీస్తూ ఉండండి బాసూ..

Tips to take care of new car : "కారు కొన్నామా.. చెప్పుకోవడానికి కారు ఉందా.. పక్కనపెట్టేశామా..," అన్నట్టు అస్సలు ఉండకూడదు. కారును తరచుగా తీసి, నడుపుతూ ఉండాలి. ఇంజిన్​ను ఆన్​ చేయకుండా చాలా రోజులు గడిపేస్తే.. ప్రతికూల ప్రభావం పడుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంజిన్​ ఒక్కటే కాదు.. ఇతర పార్ట్స్​ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే.. కారు కొన్న ఏడాదిలో దానిని ఎక్కువ తిప్పాలని చెబుతుంటారు.

ఆయిల్​ ఛేంజ్​లా? అప్పుడే వద్దు..

తరచూ ఆయిల్​ ఛేంజ్​ చేయడం కూడా కారుకు మంచిది కాదు. అందుకే ఫస్ట్​, సెకెండ్​ సర్వీసుల్లో ఆయిల్​ను ఛేంజ్​ చేయమని సర్వీస్​ చేసే సిబ్బంది చెబుతుంటారు. సరైన సమయంలోనే ఆయుల్​ ఛేంజ్​ చేయాలి. అప్పుడే బండి స్మూత్​గా ఉంటుంది.

తదుపరి వ్యాసం