తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Stake Of Ambani Children: రిలయన్స్ లో ముకేశ్ అంబానీ పిల్లల్లో ఎవరికి ఎంత వాటా ఉంది..?

Reliance stake of Ambani children: రిలయన్స్ లో ముకేశ్ అంబానీ పిల్లల్లో ఎవరికి ఎంత వాటా ఉంది..?

HT Telugu Desk HT Telugu

12 March 2024, 16:26 IST

  • Reliance stake: ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యక్తి, భారత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ. రిలయన్స్ గ్రూప్ కు ఆయన చైర్మన్ గా కొనసాగుతున్నారు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులకు ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ, ఇషా అంబానీ అనే ముగ్గురు పిల్లలున్నారు.

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ముకేశ్ అంబానీ కుటుంబం
అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ముకేశ్ అంబానీ కుటుంబం (Reuters)

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ముకేశ్ అంబానీ కుటుంబం

Reliance stake of Ambani children: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)లో అంబానీ కుటుంబానికి ఎంత వాటా ఉందనేది చాలా మందికి ఆసక్తిని రేకెత్తించే ప్రశ్న. భారత్ లోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తగా ఉన్న ముకేశ్ అంబానీ కుటుంబానికి రిలయన్స్ గ్రూప్ లో ఉన్న వాటాల వివరాలు ఇవి..

ట్రెండింగ్ వార్తలు

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

Facebook, Instagram down: ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ డౌన్; నెటిజన్స్ ఫైర్..

Trading guide: ఈ రోజు ఈ స్టాక్స్ తో లాభాలు గ్యారెంటీ అని నిపుణుల సూచన

Gold price today: తగ్గుతున్న పసిడి ధర; కొనేందుకు ఇదే సరైన సమయమా?

కోకిలాబెన్ అంబానీ…

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)లో అంబానీ కుటుంబానికి చెందిన కోకిలాబెన్ అంబానీకి 1,57,41,322 షేర్లు ఉన్నాయి. కోకిలాబెన్ అంబానీ ముకేశ్ అంబానీ మాతృమూర్తి, రిలయన్స్ ను స్థాపించిన ధీరూభాయి అంబానీ భార్య. ఫోర్బ్స్ ప్రకారం, భారతదేశపు అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ప్రస్తుం రిలయన్స్ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. ఆర్ఐఎల్ లో ముకేశ్ అంబానీ, ఆయన ప్రైవేట్ సంస్థలకు 47.29 శాతం వాటా ఉండగా, 2019 సెప్టెంబర్ నాటికి అది 48.87 శాతానికి పెరిగింది.

అంబానీ కుటుంబ సభ్యులు

ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ. వీరిలో అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలు మార్చి తొలి వారంలో గుజరాత్ లోని జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో ముకేశ్ అంబానీ పిల్లల్లో ఒక్కొక్కరికి 80,52,021 షేర్లు ఉన్నాయి. ఇది కంపెనీలో 0.12 శాతం వాటాకు దగ్గరగా ఉంది. ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ డైరెక్టర్లుగా ఉండగా, అనంత్ అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ గా ఉన్నారు.

నేను హనుమాన్

ఇటీవల ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ (Anant Ambani) తన తోబుట్టువులు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీలతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు. తనకు తన సోదరుడు ఆకాశ్ అంబానీ శ్రీరాముడి లాంటి వాడని, సోదరి ఇషా అంబానీ తనకు తల్లి లాంటిదని అనంత్ అంబానీ తెలిపారు. ‘‘వారిద్దరూ నాకంటే పెద్దవారు. నేను వారికి హనుమంతుడి వంటివాడిని. నా సోదరుడు నాకు రాముడు.. నా సోదరి నాకు తల్లి లాంటిది. వారిద్దరూ నన్ను ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉంటారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పోటీ లేదు. మాది ఫెవికాల్ బంధం’’ అని అనంత్ అంబానీ పేర్కొన్నారు.

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్ నగర్ లో మార్చి 1 నుంచి మార్చి 3వ తేదీ వరకు జరిగాయి. బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, రిహానా, ఇవాంకా ట్రంప్, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, గూగుల్ అధ్యక్షుడు డొనాల్డ్ హారిసన్, బొలీవియా మాజీ అధ్యక్షుడు జార్జ్ క్విరోగా, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్ పర్సన్ క్లాస్ ష్వాబ్, షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపిక పదుకోన్, కత్రినా కైఫ్.. వంటి బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

తదుపరి వ్యాసం