తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Creta N Line : హ్యుందాయ్​ క్రేటా ఎన్​ లైన్​ లాంచ్​.. ధర ఎంతంటే..

Hyundai Creta N Line : హ్యుందాయ్​ క్రేటా ఎన్​ లైన్​ లాంచ్​.. ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

12 March 2024, 5:56 IST

    • Hyundai Creta N Line launched : హ్యుందాయ్​ క్రేటా ఎన్​ లైన్​ ఎస్​యూవీ వచ్చేసింది! ఈ ఎస్​యూవీ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఇదిగో హ్యుందాయ్​ క్రేటా​ ఎన్​ లైన్​..
ఇదిగో హ్యుందాయ్​ క్రేటా​ ఎన్​ లైన్​..

ఇదిగో హ్యుందాయ్​ క్రేటా​ ఎన్​ లైన్​..

Hyundai Creta N Line launched in India : ఇండియాలో హ్యుందాయ్​కు బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా ఉన్న క్రేటాలో కొత్త ట్రిమ్​ని లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. దీని పేరు హ్యుందాయ్​ క్రేటా ఎన్​ లైన్​. ఈ ఎన్​ లైన్​ ట్రిమ్​ వస్తున్న మూడో హ్యుందాయ్​ కారు ఈ క్రేటా ఎస్​యూవీ. ఇప్పటికే.. ఐ20, వెన్యూల్లో ఎన్​ లైన్​ ఉంది. ఈ నేపథ్యంలో.. కొత్త వెహికిల్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ చూసేద్దాము..

హ్యుందాయ్​ క్రేటా​ ఎన్​ లైన్​- ఫీచర్స్​..

స్టాండర్డ్​ క్రేటా ఎస్​యూవీతో పోల్చితే.. ఈ హ్యుందాయ్​ క్రేటా​ ఎన్​ లైన్​ బంపర్స్​, గ్రిల్​లో స్వల్పంగా మార్పు కనిపిస్తుంది. పైగా దీనికి రెడ్​ యాక్సెంట్స్​ వస్తున్నాయి. 18 ఇంచ్​ రీ-డిజైన్డ్​ అలాయ్​ వీల్స్​, రేర్​ స్పాయిలర్​, డ్యూయెల్​ ఎగ్జాస్ట్​ టిప్స్​ వంటివి కూడా లభిస్తున్నాయి.

ఈ ఎస్​యూవీలో మూడు మోనోటోన్​, ఒక డ్యూయెల్​ టోన్​ కలర్​ ఆప్షన్స్​ ఉన్నాయి. అవి.. అట్లాస్​ వైట్​, ఎబిస్​ బ్లాక్​, టైటాన్​ గ్రే మాట్​, అట్లాస్​ వైట్​ విత్​ ఎబిస్​ బ్లాక్​ రూఫ్​, థండర్​ బ్లూ విత్​ ఎబిస్​ బ్లాక్​ రూఫ్​, షాడో గ్రే విత్​ ఎబిస్​ బ్లాక్​ రూఫ్​.

ఇక హ్యుందాయ్​ క్రేటా​ ఎన్​ లైన్​ ఎస్​యూవీ ఇంటీరియర్​లో ఆల్​ బ్లాక్​ థీమ్​ విత్​ రెడ్​ యాక్సెంట్స్​, ఇన్​సర్ట్స్​ వస్తున్నాయి. గేర్​ లివర్​, స్టీరింగ్​ వీల్​, బ్లాక్​ లెథరేట్​ సీట్​ అప్​హోలి​స్ట్రీల మీద ఎన్​ లైన్​ బ్యాడ్జ్​లు కనిపిస్తాయి.

Hyundai Creta N Line price in India : ఈ ఎస్​యూవీలో.. ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ కోసం డ్యూయెల్​ 10.25 ఇంచ్​ స్క్రీన్​ వస్తున్నాయి. యాంబియెంట్​ లైటింగ్​, వయర్​లెస్​ స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీ, డ్యూయెల్​ జోన్​ క్లైమేట్​ కంట్రోల్​ కూడా ఉన్నాయి.

ఇక ఈ హ్యుందాయ్​ కారులో బోస్​ మ్యూజిక్​ సిస్టెమ్​, వయర్​లెస్​ ఛార్జర్​, 360 డిగ్రీ సరౌండ్​ కెమెరా, పానారోమిక్​ సన్​రూఫ్​, ప్యాడిల్​ షిఫ్టర్స్​, డ్యూయెల్​ డాష్​ కెమెరా, పవర్డ్​ డ్రైవర్​ సీట్​, లెవల్​ 2 అడాస్​ సూట్​ కూడా ఉన్నాయి.

హ్యుందాయ్​ క్రేటా​ ఎన్​ లైన్​- ఇంజిన్​..

Hyundai Creta N Line : ఈ హ్యుందాయ్​ క్రేటా ఎన్​ లైన్​ ఎస్​యూవీలో రెండు వేరియంట్లు ఉంటాయి. అవి.. ఎన్​8, ఎన్​10. ఈ రెండింటికీ ఒకటే ఇంజిన్​ వస్తోంది. అది.. 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​. ఇది.. 158 హెచ్​పీ పవర్​ని, 253 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​, డీసీటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 0-100 కేఎంపీహెచ్​ని 8.9 సెకన్లలో అందుకుంటుంది ఈ ఎస్​యూవీ.

హ్యుందాయ్​ క్రేటా​ ఎన్​ లైన్​- ధర..

ఇండియాలో హ్యుందాయ్​ క్రేటా​ ఎన్​ లైన్​ ఎక్స్​షోరూం ధరలు రూ. 16.82 లక్షలు- రూ. 20.3 లక్షల మధ్యలో ఉంటుంది.

మరి ఈ హ్యుందాయ్​ కొత్త మోడల్​ ఏమేరకు కస్టమర్లను ఆకర్షిస్తుందో చూడాలి.

తదుపరి వ్యాసం