తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : గుడ్​ న్యూస్​.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు..!

Gold and silver rates today : గుడ్​ న్యూస్​.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు..!

Sharath Chitturi HT Telugu

07 May 2023, 5:37 IST

    • Gold and silver rates today : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్లాటీనం రేట్లు పెరిగాయి. పూర్తి వివరాలు..
గుడ్​ న్యూస్​.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు..!
గుడ్​ న్యూస్​.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు..! (MINT_PRINT)

గుడ్​ న్యూస్​.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు..!

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు ఆదివారం భారీగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 700 తగ్గి.. రూ. 56,500కి చేరింది. శనివారం ఈ ధర రూ. 57,200గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 7000 దిగొచ్చి రూ. 5,65,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,650గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 760 తగ్గి.. రూ. 61,640కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,400గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7600 దిగొచ్చి.. రూ. 6,16,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,164గా ఉంది.

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,650గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,790గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,500 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 61,640గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,920గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,090గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 56,550గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,690గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,550గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,690గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,500గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,770గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 550 తగ్గి.. రూ. 77,700కి చేరింది. శనివారం ఈ ధర రూ. 78,250గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 82,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 77,700.. బెంగళూరులో రూ. 82,400గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 410 పెరిగి.. రూ 27,850కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,440గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,850గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం