తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Silver Rate Today: తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధర.. నేటి లెక్కలివే

Gold Silver Rate Today: తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధర.. నేటి లెక్కలివే

02 November 2022, 6:17 IST

    • Today Gold and Silver Price: కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే మంగళవారం ధర తగ్గగా.... ఇవాళ స్వల్పంగా దిగివచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,780గా నమోదైంది. మరోవైపు ఇవాళ వెండి రేటు పెరిగింది.
బంగారం వెండి ధరలు
బంగారం వెండి ధరలు

బంగారం వెండి ధరలు

Gold silver price today 02 November 2022: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. ఇక మంగళవారం ధరలు తగ్గగా ... ఇవాళ కూడా స్వల్పంగా దిగివచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.60 తగ్గగా... 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 50 దిగివచ్చింది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

ఫలితంగా హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,780గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46, 550 గా ఉంది. ఇక కిలో వెండిపై ఇవాళ రూ.2000 పెరగగా... హైదరాబాద్ లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 65,000గా ఉంది.

Gold silver price: ఏపీలో ధరలు…

gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,550గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 50,780గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 65,000 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780గా ఉంది.

Gold silver price: పలు నగరాల్లో ఇలా..

gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,300గాఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,700గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,930 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,600గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,830 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50,780గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,550 వద్ద కొనసాగుతోంది.

Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా..

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 100 చొప్పున తగ్గింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 24,760గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 24,760గా ఉంది.

ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనే రంగాలపై పడింది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.

తదుపరి వ్యాసం