తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : పసిడి పరుగుకు బ్రేక్​.. స్థిరంగా వెండి రేటు- నేటి లెక్కలివే!

Gold and silver prices today : పసిడి పరుగుకు బ్రేక్​.. స్థిరంగా వెండి రేటు- నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu

21 April 2024, 9:41 IST

    • Gold and silver prices today : దేశంలో పసిడి పరుగుకు బ్రేక్​ పడింది. ఆదివారం.. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా మారలేదు. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 68,050గా ఉంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,80,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,805గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Stocks to buy today : భారీగా పతనమైన టాటా మోటార్స్​ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ ప్రాఫిట్స్​!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 74,240 వద్ద ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,42,400గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,210గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,390గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,050 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 74,240గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,850గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,110గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 68,050గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 74,240గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,050గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,240గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,090గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 74,290గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68,050గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,240గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,650గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 86,500గా ఉంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 90,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 86,500.. బెంగళూరులో రూ. 86,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం మారలేదు. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 25,010గా ఉందే. ఆ ముందు రోజు కూడా ఇదే ధర ఉంది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,010గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం