తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fixed Deposit Rate : ఎఫ్​డీలపై 9శాతం వరకు వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే..!

Fixed deposit rate : ఎఫ్​డీలపై 9శాతం వరకు వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే..!

Sharath Chitturi HT Telugu

19 May 2023, 10:15 IST

  • Fixed deposit interest rate: కొత్తగా ఎఫ్​డీ ఓపెన్​ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఎఫ్​డీలపై 9శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

ఎఫ్​డీలపై 9శాతం వరకు వడ్డీలు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
ఎఫ్​డీలపై 9శాతం వరకు వడ్డీలు ఇస్తున్న బ్యాంకులు ఇవే..! (iStock)

ఎఫ్​డీలపై 9శాతం వరకు వడ్డీలు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!

Fixed deposit interest rate: వడ్డీ రేట్ల పెంపును ఆర్​బీఐ బ్రేక్​ వేసింది. అయితే.. పలు బ్యాంకులు మాత్రం ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఏకంగా 9శాతం వరకు వడ్డీలు ఇస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ఫెడరల్​ బ్యాంక్​..

Fedaral Bank FD rates : ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది ఫెడరల్​ బ్యాంక్​. రూ. 2కోట్ల కన్నా తక్కువ ఎఫ్​డీలకు ఇది వర్తిస్తుంది. సాధారణ ప్రజలకు 3శాతం- 6.6శాతం మధ్యలో వడ్డీ రేట్లు ఉన్నాయి. సీనియర్​ సిటిజెన్​లకు 3.5శాతం నుంచి 7.25శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. 17 మే నుంచే ఇది అమల్లోకి వచ్చింది. 7 రోజులు- 5ఏళ్ల మెచ్యూరిటీ ఉన్న ఎఫ్​డీలకు ఇది వర్తిస్తుంది.

బ్యాంక్​ ఆఫ్​ బరోడా..

Bank of Baroda FD rates : ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు బ్యాంక్​ ఆఫ్​ బరోడా ప్రకటించింది. రూ. 2కోట్ల కన్నా తక్కువ డిపాజిట్లపై 30 బేసిస్​ పాయింట్లు పెంచింది. ఇది మే 12న అమల్లోకి వచ్చింది. 399 డే బరోడా తిరంగా ప్లస్​ డిపాజిట్​ స్కీమ్​లో 7.90శాతం వడ్డీ లభిస్తోంది.

ఇదీ చూడండి:- PPF crorepati: పీపీఎఫ్ లో పెట్టుబడులతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే..

తాజా హైక్​తో ఈ బ్యాంక్​లో సాధారణ కస్టమర్లకు 3శాతం నుంచి 7.25శాతం వరకు వడ్డీ రేట్లు లభిస్తుండగా.. సీనియర్​ సిటిజెన్​కు అది 3.5శాతం నుంచి 7.75శాతం వరకు వస్తోంది.

సూర్యోదయ బ్యాంక్​..

Suryodaya small Finance bank FD rates : సూర్యోదయ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​.. తమ ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను సవరించింది. ఇది మే 5న అమల్లోకి వచ్చింది. సాధారణ ప్రజలకు వడ్డీ రేట్లు 4శాతం నుంచి 9.10శాతం వరకు ఉన్నాయి. ఇక సీనియర్​ సిటీజెన్​కు ఈ బ్యాంక్​లో 4.50శాతం నుంచి 9.60శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి.

యూనిటీ బ్యాంక్​..

యూనిటీ స్మాల్​ ఫైనాన్స్​​ బ్యాంక్​లో ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను సవరించారు. ఇది మే 2 నుంచి అమల్లోకి వచ్చింది. సాధారణ కస్టమర్లకు 4.5శాతం నుంచి 9శాతం మధ్యలో వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇక సీనియర్​ సిటీజెన్​కు 9.5శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి.

తదుపరి వ్యాసం