తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Idbi Bank Fd Rates: ఎక్కువ వడ్డీతో కొత్త ఎఫ్‍డీ స్కీమ్ తీసుకొచ్చిన ఐడీబీఐ.. ఎఫ్‍డీ వడ్డీ రేట్ల సవరణ

IDBI Bank FD Rates: ఎక్కువ వడ్డీతో కొత్త ఎఫ్‍డీ స్కీమ్ తీసుకొచ్చిన ఐడీబీఐ.. ఎఫ్‍డీ వడ్డీ రేట్ల సవరణ

02 April 2023, 22:51 IST

    • IDBI Bank FD Rates: వివిధ కాలపరిమితి కలిగి ఉన్న ఎఫ్‍డీలపై వడ్డీ రేట్లను ఐడీబీఐ బ్యాంక్ సవరించింది. అలాగే కొత్త ఎఫ్‍డీ స్కీమ్‍ను ప్రవేశపెట్టింది.
IDBI Bank FD Rates: ఎక్కువ వడ్డీతో కొత్త ఎఫ్‍డీ స్కీమ్ తీసుకొచ్చిన ఐడీబీఐ
IDBI Bank FD Rates: ఎక్కువ వడ్డీతో కొత్త ఎఫ్‍డీ స్కీమ్ తీసుకొచ్చిన ఐడీబీఐ (HT Photo)

IDBI Bank FD Rates: ఎక్కువ వడ్డీతో కొత్త ఎఫ్‍డీ స్కీమ్ తీసుకొచ్చిన ఐడీబీఐ

IDBI Bank FD Rates: రూ.2కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల(Fixed Deposits - FDs)కు వడ్డీ రేట్లను సవరించింది ప్రైవేటు బ్యాంక్ ఐడీబీఐ (IDBI Bank). ఇప్పటికే ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. అలాగే అమృత్ మహోత్సవ్ ఎఫ్‍డీ (Amrit Mahotsav FD) పేరుతో కొత్త ఎఫ్‍డీ పథకాన్ని ఆ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఎఫ్‍డీ ద్వారా సాధారణం కంటే ఎక్కువ వడ్డీని అందించనుంది. అలాగే, ఎఫ్‍డీ రేట్లను ఐడీబీఐ సవరించింది. దీంతో ఐడీబీఐలో ఎఫ్‍డీ రేట్లు 3 శాతం నుంచి 6.75 శాతం మధ్య ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.25 శాతం మధ్య ఉన్నాయి. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ కాలపరిమితులు (Maturity) కలిగిన ఎఫ్‍డీలు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇవే.

అమృత్ మహోత్సవ్ ఎఫ్‍డీ

IDBI Amrit Mahotsav FD: అమృత్ మహోత్సవ్ ఎఫ్‍డీ స్కీమ్‍ను ఐడీబీఐ తీసుకొచ్చింది. దీని మెచ్యురిటీ గడువు 444 రోజులుగా ఉంది. ఈ ఎఫ్‍డీలో డిపాజిట్ చేస్తే సాధారణ వినియోగదారులకు 7.15 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.65 శాతంగా ఉంది.

ఐడీబీఐ ఎఫ్‍డీ రేట్లు

IDBI Bank FD Rates: 7 నుంచి 30 రోజుల మెచ్యూరిటీ ఎఫ్‍డీలపై 3 శాతం వడ్డీ రేటును ఐడీబీఐ ఇస్తోంది. 31 నుంచి 45 రోజుల మధ్య కాలపరిమితి ఉండే ఎఫ్‍డీపై 3.35 శాతం, 46 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‍డీకి 4.25 శాతం వడ్డీని ఐడీబీఐ అందిస్తోంది. 91 రోజుల నుంచి 6 నెలల మెచ్యూరిటీ ఉండే ఎఫ్‍డీలపై 4.75 శాతం, ఆరు నెలల ఒక్క రోజు నుంచి 1 సంవత్సరం వరకు కాలపరిమితి ఉండే ఎఫ్‍డీపై 5.50 శాతం వడ్డీని ఆ బ్యాంక్ ఇస్తోంది.

ఇక సంవత్సరం మెచ్యూరిటీ గడువు ఉండే ఎఫ్‍డీపై 6.75 శాతం వడ్డీ రేటును ఐడీబీఐ ప్రస్తుతం ఇస్తోంది. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల (444 రోజులను మినహాయించి) కాలపరిమితి ఎఫ్‍డీలపై 6.75 శాతం, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‍డీలపై 6.50 శాతం వడ్డీని ఐడీబీఐ ఇస్తోంది. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలపరిమితి ఉండే ఎఫ్‍డీలపై 6.25 శాతం వడ్డీని ఆ ఐడీబీఐ అందిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కొత్త ఎఫ్‍డీ రేట్లు వర్తించనున్నాయని ఆ బ్యాంక్ తెలిపింది. ఇక సీనియర్ సిటిజన్లకు అన్ని ఎఫ్‍డీలపై అర శాతం (0.50 శాతం) వడ్డీ రేటు అధికంగా ఉంటుంది.

తదుపరి వ్యాసం