తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Entry Level 5g Phones : తక్కువ ధరకు 5జీ స్మార్ట్​ఫోన్​ కొనాలా? ఈ లిస్ట్​ మీకోసమే..

Best entry level 5G phones : తక్కువ ధరకు 5జీ స్మార్ట్​ఫోన్​ కొనాలా? ఈ లిస్ట్​ మీకోసమే..

Sharath Chitturi HT Telugu

01 May 2023, 10:05 IST

    • Best entry level 5G phones in India : తక్కువ ధరకు మంచి 5జీ స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? ఈ లిస్ట్​ మీకోసమే..
తక్కువ ధరకు 5జీ స్మార్ట్​ఫోన్​ కొనాలా? ఇవి ది బెస్ట్​..!
తక్కువ ధరకు 5జీ స్మార్ట్​ఫోన్​ కొనాలా? ఇవి ది బెస్ట్​..!

తక్కువ ధరకు 5జీ స్మార్ట్​ఫోన్​ కొనాలా? ఇవి ది బెస్ట్​..!

Best entry level 5G phones in India : ఇండియాలో 5జీ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​ రోజురోజుకు పెరిగిపోతోంది. అనేక కంపెనీలు వివిధ మోడల్స్​ను లాంచ్​ చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మరి మీరు కూడా 5జీ స్మార్ట్​ఫోన్​ కొనాలని భావిస్తున్నారా? ఎంట్రీ లెవల్​లో.. అంటే తక్కువ ధరకు లభిస్తున్న ది బెస్ట్​ 5జీ స్మార్ట్​ఫోన్స్​ వివరాలు ఇక్కడ చూసేయండి..

లావా బ్లేజ్​ 5జీ..

Lava Blaze 5G price : ఇండియాలో అత్యంత చౌకైన స్మార్ట్​ఫోన్​గా గుర్తింపు తెచ్చుకుంది ఈ లావా బ్లేజ్​ 5జీ. దీని ధర రూ. 10,999. ఇందులో వాటర్​డ్రాప్​ నాచ్​ డిజైన్​, సైడ్​- ఫేసింగ్​ ఫింగర్​ప్రింట్​ రీడర్​ ఉన్నాయి. 6.5 ఇంచ్​ హెచ్​డీ+ ఎల్​సీడీ ప్యానెల్​ దీని సొంతం. డైమెన్సిటీ 700 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంటుంది. 4జీబీ ర్యామ్​/ 128జీబీ స్టోరేజ్​, 6జీబీ ర్యామ్​/ 128జీబీ స్టోరేజ్​ వేరియంట్లలో ఇది లభిస్తుంది. ఇందులో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. 50ఎంపీ ట్రిపుల్​ కెమెరా సెటప్​ దీని సొంతం. సెల్ఫీ కోసం 8ఎంపీ కెమెరా లభిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

వివో టీ2ఎక్స్​ 5జీ..

Vivo T2x 5G price : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోకి ఇటీవలే వచ్చింది వివో టీ2ఎక్స్​. దీని ప్రారంభ ధర రూ. 12,999. ఇందులో వాటర్​డ్రాప్​ నాచ్​, సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ సెన్సార్​ ఉంటుంది. 6.58 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ ఎల్​సీడీ స్క్రీన్​, 500ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఇందులో డైమెన్సిటీ 6020 చిప్​సెట్​ ఉంది. 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​-128జీబీ స్టోరేజ్​ వేరియంట్లలో ఈ గ్యాడ్జెట్​ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ మైక్రో సెన్సార్​లు ఉన్నాయి. సెల్ఫీ కోసం 8ఎంపీ కెమెరా లభిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14 5జీ..

Samsung Galaxy M14 5G price : ఇందులో ఫ్రెంట్​ కెమెరాకు వాటర్​డ్రాప్​ నాచ్​తో పాటు సైడ్​ ఫేసింగ్​ బయోమెట్రిక్​ రీడర్​ వస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 14,990. 6.6 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ ఎల్​సీడీ స్క్రీన్​, గొరిల్లా గ్లాస్​ 5 ప్రొటెక్షన్​, 6000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఎక్సినోస్​ 1330 ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత 1 యూఐ కోర్​ 5.1పై ఇది పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 6జీబీ ర్యామ్​ృ 128జీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉన్నాయి. ఇక 50ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరా, 13ఎంపీ సెల్ఫీ కెమెరాలు లభిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

పోకో ఎక్స్​5 5జీ..

Poco X5 5G price in India : ఇందులో టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​, ఐపీ53 రేటెడ్​ బాడ, సైడ్​ ఫేసింగ్​ ఫింగర్​ప్రింట్​ రీడర్​ లభిస్తున్నాయి. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 18,999. 6.67 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ ఆమోలెడ్​ ప్యానెల్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఇందులో స్నాప్​డ్రాగన్​ 695 చిప్​సెట్​ ఉంటుంద. 8జీబీ ర్యామ్​/128 జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​/256 జీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉన్నాయి. 48ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్​, 2ఎంపీ మాక్రో సెన్సార్​లు ఉన్నాయి. సెల్ఫీ కోసం 12ఎంపీ కెమెరా వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం