Lava Blaze 5G new variant : లావా బ్లేజ్ 5జీ కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే!
Lava Blaze 5G new variant launched : లావా బ్లేజ్ 5జీ కొత్త వేరియంట్ లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Lava Blaze 5G new variant launched : లావా బ్లేజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌కు కొత్త వేరియంట్ వచ్చి చేరింది. లావా బ్లేజ్ 5జీ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ తాజాగా లాంచ్ అయ్యింది. ఈ వేరియంట్‌కు సంబంధించిన ఫీచర్స్, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
లావా బ్లేజ్ 5జీ 6జీబీ ర్యామ్ వేరియంట్- ధర..
లావా బ్లేజ్ 5జీ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999గా ఉంది. ఇంట్రొడక్టరీ ప్రైజ్ కింద రూ. 11,499కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తోంది లావా సంస్థ. ఇందులో గ్లాస్ బ్లాక్ డిజైన్ ఉంటుంది. గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ కలర్స్లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లోనూ ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు.
Lava Blaze 5G new variant price : లావా బ్లేజ్ 5జీ 6జీబీ ర్యామ్ వేరియంట్.. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న మోడల్‌ను పోలి ఉంటుంది. ఇందులో 6.5 ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే విత్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఉంది. వాటర్ డ్రాప్- నాచ్, ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌తో కూడిన డిజైన్ దీని సొంతం.
Smartphones to gift on Valentine's Day : ఈ వాలెంటైన్స్ డేకి మీకు ఇష్టమైన వారికి గిఫ్ట్‌గా ఇచ్చేందకు చూడాల్సిన స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ లావా బ్లేజ్ 5జీ కొత్త వేరియంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ చిప్సెట్ ఉంటుంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్ కూడా ఉంది. 2.2 జీహెచ్‌జెడ్, ఎల్పీడీడీఆర్4ఎక్స్ మెమోరీ, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ వంటివి ఉన్నాయి. కొత్త వేరియంట్లో మెమొరీ కార్డ్ స్లాట్ కూడా ఉండటం విశేషం. 1టీబీ వరకు స్టోరేజ్‌ను ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్..
Lava Blaze 5G 6GB features : ఆండ్రాయిడ్ 12 ఓస్పై ఈ లావా బ్లేజ్ 5జీ కొత్త వేరియంట్ పనిచేస్తుంది. ఎనానిమస్ కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉండటం మరింత ప్రత్యేకం. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సైతం ఉంది.
ఇక లావా బ్లేజ్ 5జీలో.. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. 2కే వీడియో రికార్డింగ్ కూడా ఉంది. సెల్ఫీ కోసం 8ఎంపీ కెమెరాని ఇచ్చింది లావా బ్లేజ్ 5జీ.