Smart TV: రూ.6,999 ధరకే నయా స్మార్ట్ టీవీ లాంచ్.. మరో మూడు రోజులే ప్రత్యేక ధర!
Blaupunkt Sigma 24-inch: తక్కువ ధరలో స్మార్ట్ టీవీ (Budget Smart TV) కావాలనుకునే వారికి మంచి ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. రూ.6,999 ధరతో బ్లౌపంక్ట్ సిగ్మా 24 ఇంచుల స్మార్ట్ టీవీ లాంచ్ అయింది. దీని స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..
Blaupunkt Sigma 24-inch: బడ్జెట్ రేంజ్‍లో మరో స్మార్ట్ టీవీని భారత మార్కెట్‍లోకి తీసుకొచ్చింది జర్మనీ కంపెనీ బ్లౌపంక్ట్ (Blaupunkt). 24 ఇంచుల డిస్‍ప్లేతో బ్లౌపంక్ట్ సిగ్మా స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. దీన్ని మానిటర్‌గానూ ఉపయోగించుకోవచ్చు. హెచ్‍డీ రెడీ రెజల్యూషన్ డిస్‍ప్లే, సన్నని అంచులతో బ్లౌపంక్ట్ సిగ్మా 24 ఇంచ్ స్మార్ట్ టీవీ వస్తోంది. ప్రస్తుతం ప్రత్యేకమైన ఇంట్రడక్టరీ ధరకు సేల్‍కు ఉంది. బ్లౌపంక్ట్ సిగ్మా 24 ఇంచుల టీవీ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, సేల్ వివరాలు ఇవే.
బ్లౌపంక్ట్ సిగ్మా 24-ఇంచ్ ధర, సేల్
Blaupunkt Sigma 24-inch price: బ్లౌపంక్ట్ సిగ్మా 24 ఇంచ్ టీవీ ధర రూ.6,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ టీవీ సేల్‍కు అందుబాటులో ఉంది. రూ.6,999 ఇంట్రడక్టరీ ధర అని, ఈనెల 12వ తేదీ వరకు ఈ ధర ఉంటుందని బ్లౌంపక్ట్ పేర్కొంది. ఆ తర్వాత దీని ధర కాస్త పెరిగే ఛాన్స్ ఉంది.
Blaupunkt Sigma 24-inch: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
1366x768 పిక్సెల్స్ హెచ్‍డీ రెడీ రెజల్యూషన్ ఉండే 24 ఇంచుల డిస్‍ప్లేతో ఈ బ్లౌపంక్ట్ సిగ్మా 24 ఇంచ్ స్మార్ట్ టీవీ వస్తోంది. 300 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 512జీబీ ర్యామ్, 4జీబీ స్టోరేజీతో ఈ టీవీ వస్తోంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ (Linux OS) పై ఈ టీవీ రన్ అవుతుంది. క్వాడ్ కోర్ ఏ35 ప్రాసెసర్ ఉంటుంది.
20వాట్ల సౌండ్ ఔట్‍పుట్ ఇచ్చే స్పీకర్లు Blaupunkt Sigma 24-inch టీవీకి ఉంటాయి. టీవీ బాటమ్‍లో స్పీకర్లు ఉంటాయి. సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంటుంది. మొబైళ్లు, ల్యాప్‍టాప్‍లతో పాటు సపోర్ట్ చేసే డివైజ్‍ల నుంచి స్క్రీన్ మిర్రరింగ్‍కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది.
వైఫై, బ్లూటూత్, రెండు హెచ్‍డీఎఐ పోర్టులు, రెండు యూఎస్‍బీ పోర్టులతో Blaupunkt Sigma 24-inch వస్తోంది. స్క్రీన్ 24 ఇంచులు ఉండటంతో మానిటర్‌గానూ ఈ టీవీని ఉపయోగించుకునేందుకు సులువుగా ఉంటుంది. హెచ్‍డీఎం కేబుల్ ద్వారా సీపీయూకు కనెక్ట్ చేసుకొని మానిటర్‌గా వినియోగించుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ కూడా ఈ టీవీకి ఉంటుంది.
Blaupunkt Sigma 24-inch అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, యూట్యూబ్, జీ5 సహా చాలా యాప్‍లకు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. అయితే, నెట్‍ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‍స్టార్ యాప్స్ సపోర్ట్ ఉండదు.
సంబంధిత కథనం
టాపిక్