New Soundbar: 200వాట్ల ఔట్‍పుట్‍తో బ్లౌపంక్ట్ నయా సౌండ్‍బార్ లాంచ్-blaupunkt sbw 250 soundbar launched in india know price specifications ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Soundbar: 200వాట్ల ఔట్‍పుట్‍తో బ్లౌపంక్ట్ నయా సౌండ్‍బార్ లాంచ్

New Soundbar: 200వాట్ల ఔట్‍పుట్‍తో బ్లౌపంక్ట్ నయా సౌండ్‍బార్ లాంచ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 03, 2023 07:02 PM IST

Blaupunkt SBW 250 Soundbar: 200వాట్ల సౌండ్ ఔట్‍పుట్‍తో బ్లౌపంక్ట్ ఎస్‍బీడబ్ల్యూ 250 అందుబాటులోకి వచ్చింది. విభిన్నమైన కనెక్టివిటీ ఫీచర్లతో ఈ సౌండ్‍బార్ వస్తోంది.

New Soundbar: 200వాట్ల ఔట్‍పుట్‍తో బ్లౌపంక్ట్ నయా సౌండ్‍బార్ లాంచ్ (Photo: Amazon)
New Soundbar: 200వాట్ల ఔట్‍పుట్‍తో బ్లౌపంక్ట్ నయా సౌండ్‍బార్ లాంచ్ (Photo: Amazon)

Blaupunkt SBW 250 Soundbar: బ్లౌపంక్ట్ బ్రాండ్ నుంచి మరో సౌండ్‍బార్ లాంచ్ అయింది. ఏకంగా 200 వాట్ల వరకు సౌండ్‍ ఔట్‍పుట్ సామర్థ్యంతో బ్లౌపంక్ట్ ఎస్‍బీడబ్ల్యూ 250 సౌండ్‍బార్ విడుదలైంది. వైర్లెస్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ ఫీచర్ ఉంటుంది. వైర్డ్ సౌండ్‍బార్‌గానూ వాడుకునేందుకు వివిధ రకాల పోర్టులు ఉన్నాయి.

బ్లౌంపక్ట్ ఎస్‍బీడబ్ల్యూ 250 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Blaupunkt SBW 250 Soundbar: బ్లౌపంక్ట్ ఎస్‍బీడబ్ల్యూ 250 సౌండ్‍బార్‌తో 8 ఇంచుల సబ్‍వూఫర్ కూడా వస్తోంది. డీప్ బాస్ కోసం ఈ వూఫర్ ఉపయోగపడుతుంది. మొత్తంగా ఈ సౌండ్‍బార్ 200వాట్ల వరకు సౌండ్ ఔట్‍పుట్‍ను ఇస్తుంది. మెరుగైన నాయిస్ కంట్రోల్, 3డీ సరౌండ్ సౌండ్‍ ఉంటుంది.

బ్లూటూత్ కనెక్టివిటీతో బ్లౌపంక్ట్ ఎస్‍బీడబ్ల్యూ 250 సౌండ్‍బార్ వస్తోంది. దీంతో టీవీతో పాటు ఇతర డివైజ్‍లకు కనెక్ట్ చేసుకోవచ్చు. వైర్డ్ కనెక్టివిటీ కోసం, 3.5mm AUX పోర్ట్, హెచ్‍డీఎంఐ ఏఆర్సీ, ఆప్టికల్ పోర్టులు ఈ సౌండ్‍బార్‌కు ఉంటాయి. ఓ డిజిటల్ డిస్‍ప్లే కూడా ఉంటుంది. మూడు ఈక్వలైజర్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది. పార్టీలకు ఉపయోగపడేలా గిటార్ పోర్టులు, కరవోకే పోర్టు ఈ సౌండ్‍బార్‌కు ఉన్నాయి. దీంతోపాటు ఓ రిమోట్ కూడా వస్తుంది. మ్యూజిక్ కంట్రోల్స్ తో పాటు ఆడియో మోడ్‍లను కూడా ఈ రిమోట్‍తో ఆపరేట్ చేయవచ్చు.

బ్లౌపంక్ట్ ఎస్‍బీడబ్ల్యూ 250 సౌండ్‍బార్ ధర, సేల్

Blaupunkt SBW 250 Soundbar: బ్లౌపంక్ట్ ఎస్‍బీడబ్ల్యూ 250 సౌండ్‍బార్ ధర రూ.8,499గా ఉంది. అయితే లాంచ్ ఆఫర్ కింద ప్రస్తుతం రూ.7,999 ధరకు లభిస్తోంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో ఈ సౌండ్‍బార్ అందుబాటులోకి వచ్చింది.

కాగా, ఇటీవలే బడ్జెట్ రేంజ్‍లో బ్రౌపంక్ట్ ఎస్‍బీఏ15, ఎస్‍బీఏ15జీఎం సౌండ్‍బార్లు లాంచ్ అయ్యాయి. ఎస్‍బీఏ 15 ధర రూ.1,099గా ఉంది. మరో మోడల్ రూ.1,399 ధరకు అందుబాటులో ఉంది.

Whats_app_banner