Poco X5 5G: పోకో నయా 5జీ ఫోన్ వచ్చేసింది: సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేతో..: ఫస్ట్ సేల్‍లో ఆఫర్‌-poco x5 5g price in india specifications features and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Poco X5 5g Price In India Specifications Features And Other Details

Poco X5 5G: పోకో నయా 5జీ ఫోన్ వచ్చేసింది: సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేతో..: ఫస్ట్ సేల్‍లో ఆఫర్‌

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 14, 2023 01:25 PM IST

Poco X5 5G launched in India: సూపర్ అమోలెడ్ డిస్‍ప్లే, 48 మెగాపిక్సెల్ కెమెరాతో పోకో ఎక్స్5 5జీ ఫోన్ అడుగుపెట్టింది. ఆఫర్‌తో ఫస్ట్ సేల్‍కు రానుంది.

Poco X5 5G: పోకో నయా 5జీ ఫోన్ వచ్చేసింది: సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేతో (Photo: Poco)
Poco X5 5G: పోకో నయా 5జీ ఫోన్ వచ్చేసింది: సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేతో (Photo: Poco)

Poco X5 5G launched in India: పోకో ఎక్స్5 5జీ మొబైల్ భారత మార్కెట్‍లోకి వచ్చింది. మంగళవారం ఈ మొబైల్ లాంచ్ అయింది. క్వాల్కామ్ స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఈ మిడ్ రేంజ్ మొబైల్‍లో ఉంది. రెండు వేరియంట్లలో పోకో ఎక్స్5 5జీ అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ సేల్ సందర్భంగా ప్రత్యేక బ్యాంక్ కార్డు ఆఫర్ ఉంటుంది. పూర్తి వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

సూపర్ అమోలెడ్ డిస్‍ప్లే..

Poco X5 5G Specifications: 6.67 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ సూపర్ AMOLED డిస్‍ప్లేతో పోకో ఎక్స్5 5జీ వస్తోంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఈ డిస్‍ప్లేకు ఉంటుంది. ఈ మొబైల్ డిస్‍ప్లేను పోకో ఎక్కువగా హైలైట్ చేస్తోంది.

ప్రాసెసర్, ఓఎస్

Poco X5 5G: పోకో ఎక్స్5 5జీ ఫోన్‍లో క్వాల్కామ్ స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది. ఏడు 5జీ బ్యాండ్ల సపోర్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ ఫోన్ వస్తోంది.

48 మెగాపిక్సెల్ కెమెరా

Poco X5 5G: వెనుక మూడు కెమెరాల సెటప్‍తో పోకో ఎక్స్5 5జీ వస్తోంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఈ మొబైల్‍కు ఉంది.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Poco X5 5G: 5000mAh బ్యాటరీని పోకో ఎక్స్5 5జీ కలిగి ఉంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 60 నిమిషాల్లోనే ఈ ఫోన్ ఫుల్ చార్జ్ అవుతుందని పోకో పేర్కొంది. మొత్తంగా ఈ ఫోన్ 187 గ్రాముల బరువు ఉంటుంది. 5జీ, 4జీ ఎల్‍టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. నీటి బిందువులు, డస్ట్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ53 రేటింగ్‍తో పోకో ఎక్స్5 5జీ వస్తోంది.

పోకో ఎక్స్5 5జీ ధర, సేల్, ఆఫర్లు

Poco X5 5G: పోకో ఎక్స్5 5జీ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఉండే టాప్ మోడల్ ధర రూ.20,999గా ఉంది. ఈనెల 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో సేల్‍కు వస్తుంది. సూపర్ నోవా గ్రీన్, వైల్డ్ క్రాఫ్ట్ బ్లూ, జాగ్వార్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది.

Poco X5 5G Offer: ఫస్ట్ సేల్‍లో పోకో ఎక్స్5 5జీ మొబైల్‍ను ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్‍ను రూ.16,999కే దక్కించుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం