తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fastest Car In Reverse Drive : రివర్స్​ డ్రైవ్​లో 275.7 కేఎంపీహెచ్​ స్పీడ్​- ఇదొక​ రికార్డ్​!

Fastest car in reverse drive : రివర్స్​ డ్రైవ్​లో 275.7 కేఎంపీహెచ్​ స్పీడ్​- ఇదొక​ రికార్డ్​!

Sharath Chitturi HT Telugu

10 November 2023, 7:20 IST

    • Rimac Nevera reverse speed : మీ కారును రివర్స్​ గేర్​లో ఎంత స్పీడ్​లో నడపగలరు? ఈ కారును మాత్రం.. రివర్స్​లో 275.5 కేఎంపీహెచ్​లో నడపొచ్చు!
రివర్స్​ గేర్​లో 275.7 కేఎంపీహెచ్​ స్పీడ్​- ఇదొక​ రికార్డ్​!
రివర్స్​ గేర్​లో 275.7 కేఎంపీహెచ్​ స్పీడ్​- ఇదొక​ రికార్డ్​!

రివర్స్​ గేర్​లో 275.7 కేఎంపీహెచ్​ స్పీడ్​- ఇదొక​ రికార్డ్​!

Rimac Nevera reverse speed : 275.75 కేఎంపీహెచ్​ స్పీడ్​తో దూసుకెళ్లే రిమాక్​ నెవెరా అనే ఎలక్ట్రిక్​ సూపర్​ కారు.. రికార్డులు బ్రేక్​ చేసింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్​ ఉంది! రివర్స్​ గేర్​లో ఆ స్పీడ్​ని అందుకోవడం విశేషం. వివరాల్లోకి వెళితే..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

వరల్డ్​ రికార్డ్​ బ్రేక్​ చేసిన రిమాక్​ నెవెరా..

ఈ సూపర్​ఫాస్ట్ ఎలక్ట్రిక్​​ వెహికిల్​లో కూర్చున్న డ్రైవర్లు.. రివర్స్​ గేర్​లో 275.75 కేఎంపీహెచ్​ స్పీడ్​ని టాచ్​ చేశారు. ఫలితంగా.. 20ఏళ్ల నాటి గిన్నీస్​ వరల్డ్​ రికార్డ్​ తాజాగా బ్రేక్​ అయ్యింది. అంతకుముందు.. రివర్స్​ గేర్​లో టాప్​ స్పీడ్​ అందుకున్న రికార్డు.. కాటెర్హమ్​ 7 ఫైర్​బ్లేడ్​ అనే వెహికిల్​ పేరిట ఉండేది. స్పీడ్​.. 165.08 కేఎంపీహెచ్​.

Rimac Nevera record : వాస్తవానికి.. రివర్స్​ గేర్​లో అంత స్పీడ్​లో ఎవరు నడపరు. కానీ రివర్స్​ డ్రైవింగ్​లో కూడా ఈ రేంజ్​ స్పీడ్​ని అందుకోగలుగుతోందంటే.. ఈ రిమాక్​ నెవెరా సామర్థ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇతర వాహనాల్లో లాగా.. రిమాక్​ నెవెరాలో గేర్​లు ఉండవు. నాలుగు వేరువేరు మోటార్​లు ఉంటాయి. బండి ముందుకు, వెనక్కి కదిలేందుకు అవి ఉపయోగపడతాయి. ఫలితంగా.. ముందుకు వెళుతున్నా, వెనక్కి వెళుతున్నా.. వెహికిల్​.. 0- 100 కేఎంపీహెచ్​ స్పీడ్​ని కేవలం 1.81 సెకన్లలో అందుకుంటుంది. 0-200 కేఎంపీహెచ్​ని 4.42 సెకన్లలో చేరుకుంటుంది.

రిమాక్​ నెవెరా బ్రేక్​ చేసిన వరల్డ్​ రికార్డు వీడియోను ఇక్కడ చూడండి :

"ఈ స్పీడ్​లో రివర్స్​లో నడిపేందుకు​ ఈ సూపర్​ కారులని ఎయిరోడైనమిక్స్​ని తయారు చేయలేదు. కానీ వెహికిల్​ ఈ ఫీట్​ని అందుకుంది. చాలా గొప్ప విషయం," అని నెవెరా చీఫ్​ ప్రోగ్రామ్​ ఇంజినీర్​ రెనిక్​ తెలిపారు. కొత్త గిన్నీస్​ వరల్డ్​ రికార్డు అందుకోవడం సంతోషం అన్నారు.

Rimac Nevera top speed : ఈ రిమాక్​ నెవెరాలో 120 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. అయితే.. ఈ కారును రేంజ్​కి కాకుండా, పర్ఫార్మెన్స్​ కోసం చూస్తారు. ఇందులోని ఇంజిన్​యయ 1,914 హెచ్​పీ పవర్​ని, 2,340 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ మోడల్​ టాప్​ స్పీడ్​ 412 కేఎంపీహెచ్​.

తదుపరి వ్యాసం