తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Xuv400 Exclusive Edition : ఆక్షన్​కు.. ఎక్స్​యూవీ400 ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​

XUV400 exclusive edition : ఆక్షన్​కు.. ఎక్స్​యూవీ400 ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​

21 January 2023, 12:06 IST

    • XUV400 exclusive edition : మహీంద్రా ఎక్స్​యూవీ400 ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ త్వరలో ఆక్షన్​కు వెళ్లనుంది. దీని ద్వారా వచ్చిన డబ్బును.. స్వచ్చంద కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు!
ఆక్షన్​కు.. ఎక్స్​యూవీ400 ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్
ఆక్షన్​కు.. ఎక్స్​యూవీ400 ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్

ఆక్షన్​కు.. ఎక్స్​యూవీ400 ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్

XUV400 exclusive edition : అందరు ఎంతగానో ఎదురుచూసిన ఎక్స్​యూవీ400 ఈవీ ఇటీవలే విడులైంది. కాగా.. ఇప్పుడు ఎక్స్​యూవీ400 ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​కు సంబంధించిన ఓ వార్త బయటకొచ్చింది. ఈ ఏకైక ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ను మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ.. ఆక్షన్​కు పెట్టనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు. ఆక్షన్​ విజేతకు స్వయంగా ఆ సంస్థ ఛైర్మన్​ ఆనంద్​ మహీంద్రా.. ఈ ఎక్స్​యూవీ400 ఈవీ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ను అందజేయనున్నారు!

ట్రెండింగ్ వార్తలు

Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఎస్​యూవీలు ఇవే..!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..

ఆక్షన్​తో వచ్చిన డబ్బును.. మంచి పనికోసం..!

ఎక్స్​యూవీ400 ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ ఆక్షన్​ ఈ నెల 26 నుంచి 31 వరకు జరగనుంది. ఆసక్తి ఉన్నవారు ఈ ఆక్షన్​లో పాల్గొనవచ్చు. హైదరాబాద్​లో ఫిబ్రవరి 10న జరగనున్న ఫార్ములా ఈ వీకెండ్​ ఈవెంట్​లో.. ఆ ఎలక్ట్రిక్​ వాహనాన్ని విజేతకు అందజేస్తారు ఆనంద్​ మహీంద్రా. ఈ కారు ఆక్షన్​తో వచ్చిన డబ్బును.. ఓ మంచి కార్యక్రమం కోసం వినియోగించనున్నట్టు మహీంద్రా అండ్​ మహీంద్రా వెల్లడించింది.

XUV400 exclusive edition auction : ఎక్స్​యూవీ400 ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ విక్రయంతో వచ్చిన డబ్బును.. మహీంద్రా సస్టైనెబులిటీ ఛాంపియన్​ అవార్డు విజేతకు లేదా వేరే ఏదైనా ఎన్​జీవోకు అందజేయాల్సి ఉంటుంది. ఈ రెండింట్లో ఎవరికి డబ్బును ఇవ్వాలనేది.. ఈ ఈవీ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ను కొనుగోలు చేసిన కస్టమర్​ నిర్ణయిస్తారు.

Mahindra XUV 400 vs Tata Nexon EV: ఈ ఎలక్ట్రిక్ కార్ల రేంజ్, ధర, స్పెసిఫికేషన్లు.. ఏది బెస్ట్‌? అన్న వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎక్స్​యూవీ 400కి- ఎక్స్​యూవీ400 ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​కు కాస్మొటిక్స్​ పరంగా మార్పులు కనిపిస్తున్నాయి. ఎం అండ్​ ఎం చీఫ్​ డిజైన్​ ఆఫీసర్​ ప్రతాప్​ బోస్​, ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ రిమ్​జిమ్​ దాదు కొలాబరేషన్​తో కాస్మొటిక్స్​ మార్పులు జరిగాయి. కొత్త బ్లాక్​ లెథర అప్​హోలిస్ట్రీ విత్​ కాపర్​ స్టిచింగ్​, బ్లూ ఇన్​సర్ట్స్​, డఫిల్​ బ్యాగ్​, సైడ్​ బ్యాగ్స్​, రేర్​లో బ్లూ స్టీల్​ వైర్​ కుషన్స్​ వంటివి ఈ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​లో లభిస్తున్నాయి.

ఎక్స్​యూవీ400 వివరాలు..

XUV400 EV on road price in India : ఇక సాధారణ ఎక్స్​యూవీ400 ఈవీ విషయానికొస్తే.. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉన్నాయి. అవి 34.5కేడబ్ల్యూహెచ్​, 39.2కేడబ్ల్యూహెచ్​. వీటి రేంజ్​ 456కి.మీలని తెలుస్తోంది. ఇందులో 7 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, ఆండ్రాయిడ్​ ఆటో- యాపిల్​ కార్​ప్లే, లెథరేట్​ అప్​హోలిస్ట్రీ, సింగిల్​- పేన్​ సన్​రూఫ్​, 6 ఎయిర్​బ్యాగ్స్​, ఆల్​-వీల్​ డిస్క్​ బ్రేక్స్​ వంటివి లభిస్తున్నాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ ఎస్​యూవీ ధర రూ. 15.99లక్షలు- రూ. 18.99లక్షల (ఎక్స్​షోరూం) మధ్యలో ఉంటుంది. ఇండియాలోనే బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​.. టాటా నెక్సాన్​ ఈవీకి ఇది గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

XUV400 EV features : మహీంద్రా ఎక్స్​యూవీ400కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం