తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Attack On Cm: జగన్‌పై దాడి దేనితో చేశారు… ఇంకా తేల్చలేకపోతున్న పోలీసులు… బెజవాడ పోలీసుల తీరుపై విమర్శలు

Attack On CM: జగన్‌పై దాడి దేనితో చేశారు… ఇంకా తేల్చలేకపోతున్న పోలీసులు… బెజవాడ పోలీసుల తీరుపై విమర్శలు

Sarath chandra.B HT Telugu

15 April 2024, 9:19 IST

    • Attack On CM: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి తర్వాత అన్ని వేళ్లు విజయవాడ పోలీసుల వైపే చూపిస్తున్నాయి. రాజకీయ పైరవీలతో తిష్టవేసిన అధికారుల అలసత్వమే సిఎంపై దాడికి కారణమనే వాదనలు ఉన్నాయి. 
రాష్ట్రమంతటా ప్రశాంతంగా బస్సు యాత్ర... విజయవాడలో సిఎంపై దాడి
రాష్ట్రమంతటా ప్రశాంతంగా బస్సు యాత్ర... విజయవాడలో సిఎంపై దాడి

రాష్ట్రమంతటా ప్రశాంతంగా బస్సు యాత్ర... విజయవాడలో సిఎంపై దాడి

Attack On CM: ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి Ys Jagan మీద దాడి  Attcakతర్వాత విజయవాడ పోలీసుల పనితీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫ్యాక్షన్ ప్రభావిత Faction Districts జిల్లాల్లో కూడా ప్రశాంతంగా సాగిన Memantha Siddam బస్సు యాత్ర విజయవాడకు వచ్చేసరికి ఎందుకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైరవీలతో పోస్టింగులు Postings తెచ్చుకున్న అధికారులు నగరంలో తిష్ట వేయడమే సిఎం మీద దాడికి అసలు కారణమనే విమర్శలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

IRCTC Kerala Tour Package : అలెప్పి, కొచ్చి, మున్నార్- హౌస్ బోట్ స్టేతో కేరళ ట్రిప్, ఐఆర్సీటీసీ 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇద

Tirumala Updates : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ - శ్రీవారి సర్వదర్శానికి 30 గంటలు

CM YS Jagan : ముగిసిన విదేశీ పర్యటన - ఏపీకి చేరుకున్న సీఎం జగన్, పొలిటికల్ యాక్షన్ షురూ!

Diarrhoea Cases in Vijayawada : విజయవాడను వణికిస్తున్న డయేరియా - ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..!

ముఖ్యమంత్రి మీద దాడి వ్యవహారంపై రాజకీయ విమర్శల మాటెలా ఉన్నా పోలీసుల పనితీరును మాత్రం ప్రశ్నిస్తోంది. వందలాది సాయుధ పోలీసుల నడము ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్‌ గా చేసుకుని దాడి చేయగలగడంలో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

విజయవాడ పోలీసులు కొన్నేళ్లుగా విఐపిల సేవకే పరిమితం అయ్యారు. గంజాయి మూకలు, బ్లేడ్ బ్యాచ్‌లు, క్రికెట్ బెట్టింగ్‌లు, ఆర్థిక నేరాలు యథేచ్ఛగా జరుగుతున్నా నగర పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడం అలవాటుగా చేసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత విజయవాడ పోలీస్ కమిషననరేట్‌ పరిధి ఎన్టీఆర్ జిల్లా మొత్తానికి విస్తరించింది. గతంలో విజయవాడ పరిసరప ప్రాంతాలకు పరిమితమైన కమిషనరేట్ పరిధి పెరిగిన తర్వాత పనితీరు పడిపోయింది.

పోలీస్ ఉన్నతాధికారులు కాలక్షేపం కోసం రివ్యూలు, వివిఐపిల సేవల తరించడానికి అలవాడు పడిపోయారు. ఏపీ క్యాబినెట్‌లో కీలక మంత్రి ఆశీస్సులు, సిఫార్సుతో కమిషనరేట్‌లో అపాయింట్‌మెంట్‌ జరిగాయనే ప్రచారం ఉంది.

ప్రచారం తప్ప పరిష్కారాలు ఉండవు…

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌‌గా విధులు నిర్వహిస్తున్న కాంతిరాణా గతంలో ట్రాఫిక్ డీసీపీగా పనిచేశారు. తర్వాత రాయలసీమ రేంజ్‌ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్‌గా అడిషనల్ డీజీ స్థాయి అధికారులకు నియమిస్తూ వచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి ద్వారకా తిరుమల రావు విజయవాడ సీపీగా ఉన్నారు.

ఆ తర్వాత బత్తిన శ్రీనివాసులుకు విజయవాడ బాధ్యతలు అప్పగించారు. ఆయన తర్వాత కాంతిరాణా విజయవాడ సీపీ అయ్యారు. వ్యవస్థీకృత నేరాలు, రాజకీయ జోక్యం అధికంగా ఉండే విజయవాడలో విధి నిర్వహణలో ఖచ్చితంగా ఉండే పోలీస్ అధికారుల్ని నియమించడానికి గతంలో ముఖ్యమంత్రులు ప్రాధాన్యత ఇచ్చే వారు. గత కొన్నేళ్లుగా పోలీస్‌ శాఖలో పోస్టింగులు సిఫార్సులతోనే జరుగుతుండటంతో ప్రాధాన్యత పోస్టుల వ్యవహారాన్ని కూడా నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి.

విజయవాడలో కీలక విధుల్లో ఉన్న అధికారులు నిఘాను గాలికి వదిలేయడం, చిన్నా చితక రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు కూడా తలొగ్గి పనిచేస్తారనే విమర్శలు కొన్నేళ్లుగా ఉన్నాయి. పోస్టింగులను కాపాడుకోడానికి రాజకీయంగా గాడ్‌ఫాదర్లను నమ్ముకోవడంతో విధుల మీద శ్రద్ధ పెట్టడం మానేశారు. మద్యం తాగి వాహనాలను నడిపే వాళ్లను జైళ్లకు పంపి వాటినే ఘన కార్యాలుగా ప్రచారం చేసుకోవడం నగర పోలీసులకు అలవాటుగా మారింది.

విజయవాడ సీపీ కాంతిరాణా వారంవారం డయల్ యువర్ సీపీ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఆయన తరపున ప్రతి శుక్రవారం ప్రకటన విడుదల అవుతుంది కానీ ఆయన పాల్గొన్నట్లు ఒక్కసారి కూడా ఫోటో విడుదల కాదు. సీపీగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ తతంగం నడుస్తోంది. ఈ కార్యక్రమాన్ని కింద స్థాయి అధికారులు నిర్వహించి ఆయన నిర్వహించినట్టు ప్రకటనలు విడుదల చేస్తారు. ఆ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు పరిష్కారం కూడా కావు. అయినా ఆ తంతు ఏళ్లుగా నడుస్తూనే ఉంది.

రూట్ మ్యాప్‌ ఎందుకు మారింది…?

శనివారం విజయవాడలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రూట్ మ్యాప్ మారిందనే ఆరోపణలు ఉన్నాయి. మొదట రూపొందించిన రూట్‌ మ్యాప్‌లో లేని రోడ్డులోకి సిఎం కాన్వాయ్‌ను ఎందుకు మళ్లించినట్టు స్థానికులు చెబుతున్నారు. దాడి నేపథ్యంలో ఎవరి ఒత్తిడి సిఎం కాన్వాయ్ వెళ్లాల్సిన మార్గాన్ని మళ్లించారనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

సింగ్ నగర్‌ ఫ్లైఓవర్‌ దిగిన తర్వాత బస్సుయాత్ర సాయిబాబా గుడి-పైపుల రోడ్డు మీదుగా సాగాల్సి ఉండగా చీకట్లో జగన్ బస్సు యాత్ర గంగానమ్మ గుడి రోడ్డులోకి మలుపు తిప్పారు. ఆ రోడ్డు విశాలంగా ఉన్నా, రెండువైపులా భారీ వృక్షాలు ఉన్నాయి.

విద్యుత్ తీగలు తగులుతాయనే ఉద్దేశంతో యాత్ర సాగే మార్గాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఫలితంగా ముఖ్యమంత్రి సులువుగా టార్గెట్ అయ్యారు. దాడి జరిగిన 24 గంటల తర్వాత జగన్‌పై దాడి దేనితో చేశారనే దానిపై స్పష్టత రాలేదు. దాడి చేసింది రాయితోనా, పదునైనా వస్తువుతోనా అనేది కూడా తేలలేదు.

 

తదుపరి వ్యాసం