తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Group 1 Copying :గ్రూప్-1 పరీక్షలో సీఐ కొడుకు కాపీయింగ్, ప్రిలిమ్స్ పేపర్ ఐఫోన్ తో స్కాన్!

AP Group 1 Copying :గ్రూప్-1 పరీక్షలో సీఐ కొడుకు కాపీయింగ్, ప్రిలిమ్స్ పేపర్ ఐఫోన్ తో స్కాన్!

18 March 2024, 16:52 IST

    • AP Group 1 Copying : గ్రూప్-1 ప్రిలిమ్స్ లో కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ యువకుడు పల్నాడు జిల్లాకు చెందిన సీఐ కొడుకుగా గుర్తించారు. ఐఫోన్ తో ప్రిలిమ్స్ పేపర్ స్కాన్ చేస్తూ యువకుడు పట్టుబడ్డాడు.
గ్రూప్-1 పరీక్షలో సీఐ కొడుకు కాపీయింగ్
గ్రూప్-1 పరీక్షలో సీఐ కొడుకు కాపీయింగ్ (Image Source : Twitter)

గ్రూప్-1 పరీక్షలో సీఐ కొడుకు కాపీయింగ్

AP Group 1 Copying : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్(APPSC Group 1 Prelims) పరీక్షలో కాపీయింగ్ (Copying)చేస్తూ ఒంగోలులో ఓ యువకుడు పట్టుబడ్డాడు. పోలీసుల కళ్లుగప్పి ఎగ్జామ్ సెంటర్ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లిన యువకుడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ స్కానింగ్(Group 1 copying) చేస్తూ పట్టుబడ్డాడు. ఆ యువకుడు ఓ పోలీసు అధికారి కొడుకుగా పోలీసులు గుర్తించారు. ఏపీలో మార్చి 17 గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఒంగోలులో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో శివశంకర్ అనే అభ్యర్థి కాపీ కొట్టేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. శివశంకర్ పల్నాడు జిల్లాకు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కుమారుడిగా(CI Son Held) గుర్తించారు. అభ్యర్థి శివశంకర్ ఐఫోన్‌తో ప్రిలిమ్స్ పేపర్ స్కాన్(Group 1 Copying) చేయడానికి ప్రయత్నించాడు. పక్కనున్న మరో అభ్యర్థి విషయం గమనించి ఇన్విజిలెటర్ కు తెలిపాడు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

పాస్ వర్డ్ చెప్పడానికి నిరాకరించిన శివశంకర్

జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ...అభ్యర్థి శివశంకర్‌ను పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపి పోలీసులకు అప్పగించారు. అయితే శివశంకర్ తన ఐఫోన్(iPhone) పాస్‌వర్డ్‌ను చెప్పడానికి నిరాకరించాడు. ఐటీ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ, ఐఫోన్ సమాచారాన్ని యాక్సెస్ చేయడం సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. పోలీసుల తనిఖీలు, మెటల్ డిటెక్టర్లు ఉన్నప్పటికీ శివశంకర్ ఐఫోన్‌ ఎలా పరీక్షా కేంద్రం లోపలికి తీసుకెళ్లాడో విచారిస్తున్నామన్నారు. శివశంకర్‌పై కేసు నమోదు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు తెలిపారు. పరీక్ష కేంద్రంలో భద్రతా వైఫల్యంపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించినట్లు తెలిస్తోంది.

72.55 శాతం మంది హాజరు

ఏపీపీఎస్సీ ఆదివారం రాష్ట్రంలోని 301 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ(Group 1 Prelims) పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లలో నిర్వహించిన పరీక్షకు 91,463 మంది అంటే 72.55 శాతం మంది హాజరైనట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

తదుపరి వ్యాసం