APPSC Group 1 Prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్ లో చీటింగ్, సెల్ ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థి!
APPSC Group 1 Prelims : ఏపీలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే ఒంగోలులో ఓ అభ్యర్థి సెల్ ఫోన్ లో కాపీ కొడుతూ పట్టుబడ్డాడు.
APPSC Group 1 Prelims : ఏపీలో గ్రూప్-1 ప్రిలిమ్స్(APPSC Group 1 Prelims) పరీక్ష ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలోని 301 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ లో కాపీయింగ్ (Malpractice)చేస్తూ ఓ వ్యక్తి పట్టుబడడం కలకలం రేపింది. ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజీ పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి సెల్ ఫోన్ తో పట్టుబడ్డాడు. ఎగ్జామ్ రూమ్ లో దొంగచాటుగా సెల్ ఫోన్ తీసుకెళ్లిన అభ్యర్థి...కాపీ చేస్తుండగా ఇన్విజిలేటర్ కు పట్టుబడ్డాడు. అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే కాపీ చేస్తున్న అభ్యర్థి బేస్తవారిపేటకు చెందిన శివశంకర్ గా పోలీసులు గుర్తించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లుతో పరీక్ష నిర్వహిస్తుండగా, పోలీసుల కళ్లుగప్పి శివశంకర్ సెల్ ఫోన్ ను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అసలు పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ ఎలా తీసుకెళ్లాడనే విషయంపై పోలీసులు శివశంకర్ ను విచారిస్తున్నారు.
72.3 శాతం హాజరు
గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణ తీరుపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్(APPSC Chairman Gautam Sawang) కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...మొత్తం 1.48 లక్షల మంది గ్రూప్-1 ప్రిలిమ్స్(APPSC Group 1 Prelims) పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 18 జిల్లాలో 301 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 72.3 శాతం మంది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారన్నారు. ఇటీవల 2018 గ్రూప్-1 మెయిన్స్(Group 1 Mains) ను హైకోర్టు రద్దు చేసింది. ఈ విషయంపై గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ...నియామకాలపై కోర్టుల్లో వివాదాలు ప్రాసెస్ లో భాగమే అన్నారు. ప్రభుత్వపరంగా దీనిపై నిర్ణయం ఉంటుందన్నారు.
మొత్తం 81 పోస్టులు భర్తీ
గ్రూప్-1 ప్రిలిమ్స్ (Group 1 Prelims)కు 1,48,881 మంది దరఖాస్తు చేసుకున్నారు.ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్కీనింగ్ టెస్ట్ లో ముందుగా ప్రిలిమ్స్ పరీక్షను మొత్తం 240 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించారు. ఇందులో పేపర్-1లో 120 మార్కులకు 120 ప్రశ్నలు, పేపర్-2లో 120 మార్కులకు 120 మార్కులకు నిర్వహించారు. ఒక్కో పేపర్ కు గం. 2 ల సమయం కేటాయించారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్(Group 1 Mains) పరీక్ష రాసేందుకు అనుమతినిస్తారు. ఇక మెయిన్స్ రాత పరీక్షలో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి. వీటితోపాటు లాంగ్వేజెస్ పేపర్లు తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. అయితే వీటిని క్వాలిఫైయింగ్ పరీక్షలుగా పరిగణిస్తారు. మొత్తం ఐదు పేపర్లలో ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ రాత పరీక్షను నిర్వహిస్తారు. మెయిన్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
సంబంధిత కథనం