తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kurnool Cancer Institute : కర్నూలు క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ లో 97 ఖాళీలు, దరఖాస్తులకు రేపే లాస్ట్!

Kurnool Cancer Institute : కర్నూలు క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ లో 97 ఖాళీలు, దరఖాస్తులకు రేపే లాస్ట్!

04 February 2024, 19:09 IST

    • Kurnool Cancer Institute : కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో 97 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు రేపటిలోగా దరఖాస్తులను కర్నూలు మెడికల్ కాలేజీలో అందజేయాల్సి ఉంది.
కర్నూలు క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ లో ఉద్యోగాలు
కర్నూలు క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ లో ఉద్యోగాలు

కర్నూలు క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ లో ఉద్యోగాలు

Kurnool Cancer Institute : కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో వివిధ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. జనరల్ డ్యూటీ అటెండెంట్, రేడియోథెరపీ టెక్నీషియన్ సహా మొత్తం 97 ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను వెలువడింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ . 250 కాగా SC/ST/BC/EWS/PH అభ్యర్థులు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. జులై 1, 2023 నాటికి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితి సడలింపు వర్తిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

ముఖ్యమైన తేదీలు

  • అప్లికేషన్ల స్వీకరణ - ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు
  • దరఖాస్తుల పరిశీలన- ఫిబ్రవరి 6 నుంచి 17వ తేదీ వరకు
  • తాత్కాలిక మెరిట్ జాబితా ప్రకటన - ఫిబ్రవరి 20న
  • తాత్కాలిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ - ఫిబ్రవరి 21 నుంచి 26వ తేదీ వరకు
  • తుది మెరిట్ జాబితా ప్రకటన- మార్చి 4

ఖాళీల వివరాలు

రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, మెడికల్ ఫిజిసిస్ట్- 1, జనరల్ డ్యూటీ అటెండెంట్- 30, వైద్య, భౌతిక శాస్త్రవేత్త - 8 , రేడియో థెరపీ టెక్నీషియన్ - 15, మోల్డ్ రూమ్ టెక్నీషియన్ - 2, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్-4, రేడియోగ్రాఫర్- 4, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 6, అనస్థీషియా టెక్నీషియన్- 5, ల్యాబ్ టెక్నీషియన్- 13, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్- 2, డార్క్ రూమ్ అసిస్టెంట్-1, జూనియర్ అసిస్టెంట్-4, రికార్డ్ అసిస్టెంట్- 2

ఎంపిక విధానం

అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, కర్నూలు మెడికల్ కాలేజీలోని ఏర్పాటు చేసిన కౌంటర్ లో అందజేయాలి. దరఖాస్తులకు ఫిబ్రవరి 5 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను https://kurnool.ap.gov.in, https://nandyal.ap.gov.in వెబ్ సైట్లలో పొందవచ్చు. ఈ పోస్టులకు 10వ‌ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

ఏపీ పశుసంవర్థక శాఖలో ఉద్యోగాలు

ఏపీ పశుసంవర్థక శాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాక్ లాగ్ కోటా కింద వీటిని భర్తీ చేయనుంది. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా 26 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆఫ్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 7వ తేదీ లోపు వీటిని సమర్పించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - ఏపీ పశుసంవర్థక శాఖ
  • ఉద్యోగాలు - వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్
  • ఖాళీల కేటగిరి - బ్యాక్ లాగ్ పోస్టులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది).
  • మొత్తం ఖాళీలు - 26 (ఎస్సీ -2, ఎస్టీ - 19, దివ్యాంగులు - 05)
  • ర్హతలు - బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • వయోపరిమితి - 42 ఏళ్ల లోపు ఉండాలి.
  • జీతం - రూ. 54 వేల నుంచి 1,40,540.
  • దరఖాస్తులు - ఆఫ్ లైన్
  • దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి 7 2024.(సాయంత్రం 5 గంటల లోపు)
  • దరఖాస్తులు పంపాల్సిన చిరునామా - పశుసంవర్థక శాఖ కార్యాలయం, లబ్బిపేట, విజయవాడ, పిన్ నెంబర్ - 520010.
  • అధికారిక వెబ్ సైట్ - https://ahd.aptonline.in/AHMS/

తదుపరి వ్యాసం