తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc Results 2024 : ఏపీ పదో తరగతి ఫలితాలు - సింగిల్ క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోవచ్చు

AP SSC Results 2024 : ఏపీ పదో తరగతి ఫలితాలు - సింగిల్ క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోవచ్చు

21 April 2024, 14:16 IST

    • AP Board Class 10th Results 2024 : ఏపీ పదో తరగతి ఫలితాలు(AP SSC Results) ఏప్రిల్ 22వ తేదీన అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి…
ఏపీ పదో తరగతి ఫలితాలు - 2024
ఏపీ పదో తరగతి ఫలితాలు - 2024

ఏపీ పదో తరగతి ఫలితాలు - 2024

Andhra Pradesh Board 10th Results 2024 : ఏపీ పదో తరగతి ఫలితాలు(AP SSC Results 2024) విడుదల కానున్నాయి. ఏప్రిల్ 22వ తేదీన(సోమవరాం) ఉదయం 11 గంటలకు ఏపీ SSC బోర్డు అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండటంతో కేవలం అధికారులు మాత్రమే వివరాలను వెల్లడించనున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు 6 లక్షలుపైగా విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి ఫలితాలను తొందరగా ప్రకటిస్తున్నారు. పదో తరగతి ఫలితాలను SSC బోర్డు అధికారిక వెబ్ సైట్ తో పాటు హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చెక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

How To Check AP 10th Results 2024 : HT తెలుగులో ఏపీ పదో తరగతి ఫలితాలు

NOTE : ఇక్కడ విద్యార్థి రూల్ నెంబర్ నెంబర్ ను ఎంట్రీ చేసి 'Check Results' పై క్లిక్ చేస్తే క్షణాల్లోనే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

How To Check AP Results 2024 : SSC బోర్డు సైట్ లో ఫలితాలు

  • విద్యార్థులు ఏపీ SSC బోర్డు సైట్ లోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
  • పరీక్ష రాసిన విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో "AP SSC Results 2024" లింక్‌పై క్లిక్ చేయాలి.
  • రూల్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • ఫలితాలు, మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.

 

గత ఏడాది(2023)లో చూస్తే…మే 6వ తేదీన ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం… అప్పుడు ఏప్రిల్ 18వ తేదీతో పరీక్షలు పూర్తి అయ్యాయి. కానీ ఈసారి మాత్రం…. మార్చి 30వ తేదీతో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. దీంతో గతంతో పోల్చితే ఈసారి ముందుగానే ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది రెగ్యూలర్ అభ్యర్థులు 6,23,092 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో బాలుర సంఖ్య 3,17,939గా ఉంటే బాలికల సంఖ్య 3,05,153గా ఉంది.

తదుపరి వ్యాసం