TS Inter SSC Results 2024 : ఈ నెల 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు, పదో తరగతి రిజల్ట్స్ తేదీ ఇదే!
TS Inter SSC Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై ప్రకటన వచ్చేసింది. ఈ నెల 24న ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నెల 30 లేదా మే 1న పదో తరగతి ఫలితాలు ఉంటాయని అధికారులు చెప్పారు.
TS Inter SSC Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల(TS Inter Results 2024)పై అప్డేట్ వచ్చింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలను(TS Inter Results 2024 Date) విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. అదే విధంగా పదో తరగతి ఫలితాలను(TS SSC Results 2024) ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.
ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు?
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు(TS Inter Exams 2024) నిర్వహించారు. ఈ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10 నుంచే స్పాట్ వాల్యూయేషన్ చేప్టటారు. ఏప్రిల్ 10న మూల్యాంకనం(Spto Valuation) పూర్తి చేశారు. అయితే మార్కుల నమోదు పాటు ఎలాంటి ఇతర ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలించి మార్కులు కంప్యూటీకరణ చేశారు. గతేడాది మే 9న ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ఈసారి ఎన్నికల నేపథ్యంలో 15 రోజుల ముందుగా ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తున్నారు అధికారులు. తెలంగాణ ఇంటర్ విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/home.do లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ఇంటర్ పరీక్షల(TS Inter Results 2024) ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో అందుబాటులో ఉంటాయి. ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల చేసిన క్షణాల వ్యవధిలోనే https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
టీఎస్ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result-2024
టీఎస్ ఇంటర్ సెకండియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result-2024
టీఎస్ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ ఫలితాలు లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result-2024
టీఎస్ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result-2024
విద్యార్థులు మీ ఫలితాల లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ ను ఎంట్రీ చేయాలి. సబ్మిట్ బటన్ నొక్కితే మీ మార్కుల జాబితా డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మార్కుల మెమో కాపీని పొందవచ్చు.
టీఎస్ పదో తరగతి ఫలితాలు(TS 10th Results)
తెలంగాణ పదో తరగతి ఫలితాలను(TS SSC Results 2024 date) ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేస్తామని విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. ఈ ఏడాది 5,08,385 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు. జవాబు పత్రాల మూల్యాంకనం శనివారంతో ముగిసింది. ఫలితాల డీకోడింగ్ కు వారం పడుతుందని, అనంతరం ఈనెల 30 లేదా మే 1న టెన్త్ ఫలితాలను ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఇంటర్, పదో తరగతి ఫలితాలు(TS Inter SSC Results 2024) ప్రకటనకు ఈసీ అనుమతి ఇచ్చిందని విద్యాశాఖ తెలిపింది. ఫలితాలు విడుదల అనంతరం https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు మార్కులు తెలుసుకోవచ్చు.