తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Ooty Tour 2024 : 'ఊటీ' టూర్ ధర తగ్గింది - తిరుపతి నుంచి 6 రోజుల ప్యాకేజీ - ఇవిగో వివరాలు

IRCTC Ooty Tour 2024 : 'ఊటీ' టూర్ ధర తగ్గింది - తిరుపతి నుంచి 6 రోజుల ప్యాకేజీ - ఇవిగో వివరాలు

03 February 2024, 13:08 IST

    • IRCTC Tirupati - Ooty Tour Package 2024:  ఊటీ ట్రిప్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నారా… ? అయితే ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి ఊటీకి  టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఫిబ్రవరి 13,2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి…..
తిరుపతి - ఊటీ టూర్
తిరుపతి - ఊటీ టూర్ (unsplash)

తిరుపతి - ఊటీ టూర్

IRCTC Tourism Tirupati - Ooty Package 2024: ఈ కొత్త ఏడాదిలో కొత్త ప్లేస్ లకు వెళ్లాలని అనుకుంటున్నారా...? అయితే తక్కువ ధరలోనే పలు టూర్ ప్యాకేజీలను తీసుకువస్తుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా.....ఊటీకి సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ను ఏపీలోని తిరుపతి సిటీ నుంచి ఆపరేట్ చేస్తోంది. 'ULTIMATE OOTY EX TIRUPATI ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుండగా... ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 13, 2024వ తేదీన అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

AP ECET Key 2024 : అలర్ట్... ఏపీ ఈసెట్‌ ప్రాథమిక 'కీ' విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

APHC YS Sunitha: సునీత, రాజశేఖర్‌, సిబిఐ ఎస్పీ రాంసింగ్‌ క్వాష్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

TTD SV Music College: ఎస్వీ సంగీత కళాశాల, నాదస్వర పాఠశాలలో పార్ట్‌టైమ్‌, ఫుల్‌ టైమ్‌ కోర్సులకు దరఖాస్తులు

AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావం,మరో మూడ్రోజులు వానలు, ఎండల నుంచి ఉపశమనం

ఊటీ టూర్ షెడ్యూల్ వివరాలు:

Day - 01 : తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.50 గంటలకు ట్రైన్(Train No.17230, శబరి ఎక్స్ ప్రెస్) బయల్దేరుతుంది. రాత్రి అంత జర్నీ ఉంటుంది.

Day - 02 : ఉదయం 08.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్ కి చెకిన్ అవుతారు. ఆ తర్వాత... మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

Day - 03 :బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట, టీ మ్యూజియం, Pykara వాటర్ పాల్స్ కు వెళ్తారు. రాత్రి కూడా ఊటీలోనే ఉంటారు.

Day - 04 :బ్రేక్ ఫాస్ట్ తర్వాత కున్నూరుకు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే ఉంటారు.

Day - 05 : హోటల్ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. సాయంత్రం 04.35 నిమిషాలకు రైలు(17229 - Sabari Express) ప్రయాణం మొదలవుతుంది.

Day - 06 : రాత్రి 12.05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

తిరుపతి - ఊటీ టికెట్ ధరలు:

Tirupati Ooty Tour Ticket Price: తిరుపతి - ఊటీ ప్యాకేజీ చూస్తే… కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 26,770ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 15,880 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.11,470గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. గతేడాదిలో ఇదే టూర్ ప్యాకేజీ సింగిల్ షేరింగ్ కు రూ. 29వేలుగా ఉండగా.. డబుల్ షేరింగ్ రూ. 17వేలుగా ఉండేది. ఈ కొత్త ఏడాదిలో కాస్త ధరలు తగ్గాయి. సమ్మర్ వస్తే మళ్లీ ధరలు పెరగనున్నాయి. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం