తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Uttarandhra Tour : ఉత్తరాంధ్ర వరల్డ్ ఫేమస్ టెంపుల్ టూర్ ఇదే

IRCTC Uttarandhra Tour : ఉత్తరాంధ్ర వరల్డ్ ఫేమస్ టెంపుల్ టూర్ ఇదే

Anand Sai HT Telugu

26 September 2022, 14:45 IST

    • IRCTC UTTARANDHRA WORLD FAMOUS TEMPLE Tour : ఉత్తరాంధ్ర అందాలను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఉత్తరాంధ్ర వరల్డ్ ఫేమస్ టెంపుల్ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
ఉత్తరాంధ్ర టూర్ ప్యాకేజీ
ఉత్తరాంధ్ర టూర్ ప్యాకేజీ

ఉత్తరాంధ్ర టూర్ ప్యాకేజీ

ఐఆర్‌సీటీసీ టూరిజం(IRCTC Tourism) పలు రకాల ప్యాకేజీలతో టూర్స్ అందిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు బడ్జెట్ ధరలో ప్యాకేజీలు ఇస్తోంది. అయితే దగ్గరి ప్రాంతాలకు సైతం చూడాలనుకునేవారి కోసం ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగా ఉత్తరాంధ్ర వరల్డ్ ఫేమస్ టెంపుల్ టూర్ ను ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రకటించింది. ఇందులో 1 రాత్రి, 2 రోజులు తిరిగిరావొచ్చు. క్యాబ్ లో తిరుగుతూ చూసేయోచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Day 1

ఈ టూర్ విశాఖ(Visakha)లో ప్రారంభవుతుంది. రైల్వే స్టేషన్/బస్ డిపో/విమానాశ్రయం నుండి పికప్ చేసుకుంటారు. హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్ లో అల్పాహారంలో చేసి.. ఉదయం 08:00 గంటలకు ప్రయాణం ప్రారంభమవుతుంది. అరసవల్లి(Arasavalli), శ్రీకాకుళం రోడ్డు మార్గంలో ప్రయాణం ఉంటుంది. 107 కిమీ, 3 గంటల జర్నీ ఉంటుంది. ఉదయం 11:00 గంటలకు అరసవల్లి ఆలయానికి చేరుకుంటారు

ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అరసవల్లి ఆలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 12:30 నుంచి ఒంటి గంట 30 నిమిషాల వరకు సమీపంలోని రెస్టారెంట్/హోటల్‌లో మధ్యాహ్న భోజనం పూర్తి చేయాలి. కస్టమర్ సొంత ఖర్చుతో చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 01.30 నుంచి 02:00 వరకు శ్రీకూర్మం(SriKurmam) ప్రయాణం (13 కిమీలు, 30 నిమిషాలు) చేయాలి. ఆ తర్వాత 02:30 వరకు శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథ స్వామి దర్శనం ఉంటుంది.

మధ్యాహ్నం 02:30 గంటలకు శ్రీ కూర్మం నుండి బయలుదేరి.. సాయంత్ర 04:00 గంటలకు శ్రీముఖలింగం చేరుకుంటారు. ఆ తర్వాత గంటసేపు.. శ్రీ ముఖలింగేశ్వర స్వామి దర్శనం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి.. రాత్రి 08: 30 గంటలకు చేరుకుంటుంది. హోటల్‌కు వెళ్లి.. డిన్నర్ చేసి బస చేయాలి.

Day 2

ఉదయం 08:00 గంటలకు అల్పాహారం ముగించుకుని.. హోటల్ నుండి చెక్-అవుట్ చేయాలి. రోడ్డు మార్గంలో విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానాన్ని(Simhachalam Temple) సందర్శించాలి. 09:00 గంటలకు సింహాచలం దేవస్థానానికి వస్తారు. 09:00 నుంచి 11:00 వరకు సింహాచలం దేవస్థానంలో వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి దర్శనం ఉంటుంది. 11:00 నుంచి 11:40 సింహాచలం దేవస్థానం నుండి కైలాసగిరి కొండల వరకు ప్రయాణం ఉంటుంది. 11:40 నుంచి 01:00 కైలాసగిర్ హిల్స్ సందర్శన ఉంటుంది. 01:00 టూ 02:00 సమీపంలోని రెస్టారెంట్/హోటల్‌లో మధ్యాహ్న భోజనం చేయాలి. సొంత ఖర్చుతో చేయాల్సి ఉంటుంది.

మధ్యాహ్నం 02:00 నుంచి 04:30 గంటల నుంచి ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం(Air Craft Muesium), ఆర్.కె.బీచ్(RK Beach సందర్శన చేయాలి. 04:30 టూ 05:00 గంటల నుంచి ఆర్.కె. రైల్వే స్టేషన్/బస్ డిపో/విమానాశ్రయం వద్ద డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది. టూర్ ధరలు చూసుకుంటే.. కంఫర్ట్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.13355గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ.7600 ఉండగా.. ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5680గా నిర్ణయించారు.

తదుపరి వ్యాసం