తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ycp Question In Exam: పరీక్షలో Ycp ప్రశ్న..! ఆప్షన్స్ ఇచ్చిన బీజేపీ నేత…

YCP Question in Exam: పరీక్షలో YCP ప్రశ్న..! ఆప్షన్స్ ఇచ్చిన బీజేపీ నేత…

HT Telugu Desk HT Telugu

05 November 2022, 21:58 IST

    • ycp policies question in political science exam: ఏపీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంఏ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో అధికార వైసీపీ గురించి ప్రశ్న ఉన్నట్లు కొన్ని పేపర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. బీజేపీ నేత సత్య కుమార్ స్పందిస్తూ.. పిచ్చి పీక్స్ కు అంటే ఇదేనేమో అంటూ సెటైర్లు విసిరారు.
వైసీపీ సర్కార్ పై సత్య కుమార్ ట్వీట్
వైసీపీ సర్కార్ పై సత్య కుమార్ ట్వీట్ (twitter)

వైసీపీ సర్కార్ పై సత్య కుమార్ ట్వీట్

question on ycp policies in ma political science exam: ‘వైఎస్సార్‌సీపీ విధానాల గురించి వివరించండి..? ఇది ఓ ఎగ్జామ్ లో అడిగిన ప్రశ్న అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి ఆంధ్రా వర్శిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కు సంబంధించిన పేపర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీనిపై వర్శిటీ కానీ... ఇతర అధికారులు కానీ అధికారికంగా స్పందించలేదు. అసలు ఇది నిజమేనా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

bjp leader satya kumar tweet: అయితే ఒక్కసారి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంపైకి వస్తే కథ ఎలా ఉంటుందో తెలుసు కథా..! క్షణాల్లో షేర్ ల మీద షేర్ లు అవుతుంటాయి. ప్రస్తుతం ఈ వార్త పరిస్థితి కూడా అదే..! ఇదే ఇష్యూపై ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ కూడా ట్వీట్ చేశారు.

"పిచ్చి పీక్స్ కు వెళ్లడం అంటే ఇదే! ఎం.ఏ.పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రంలో వైఎసార్సీపి పార్టీ విధానాలు కార్యక్రమాల గురించి ప్రశ్న. సమాధానం ఏమైతే బాగుంటుంది? పీజీ విద్యార్థులకు ఫీ-రీఇంబర్స్మెంట్ రద్దు చేశారనా? బీసీ ఎస్సి సబ్ ప్లాన్ నిధుల్నీ బొక్కసానికి దారి మళ్లించారనా?.. ఇంకా …? అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కు ప్రశ్నాపత్రాన్ని కూడా జోడించారు.

శుక్రవారం ఆంధ్రా వర్శిటీ డిస్టెన్స్ ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ పరీక్ష జరిగింది. ఈ ప్రశ్నా పత్రంలో 'వైసీపీ విధానాలు మరియు కార్యక్రమాల గురించి వివరించండి' అని ఓ ప్రశ్న అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ పక్షానికి అనుకూలంగా ప్రశ్నలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని యూనివర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. ఇదంతా ఫేక్ అని ఈ వార్తలను పలువురు కొట్టిపారేస్తున్నారు. సర్కార్ అంటే పడని వారు మాత్రమే ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అసలు ప్రశ్నాపత్రంలో ఈ క్వశ్చన్ అడిగారా.. లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

తదుపరి వ్యాసం