YCP Counter to CBN : “ఓ వైపు రెక్కీ… మరోవైపు రాయి” ప్రతిపక్షాలపై వైసీపీ రుసరుస-minister jogi ramesh counter to chandra babu naidu and pawan kalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ycp Counter To Cbn : “ఓ వైపు రెక్కీ… మరోవైపు రాయి” ప్రతిపక్షాలపై వైసీపీ రుసరుస

YCP Counter to CBN : “ఓ వైపు రెక్కీ… మరోవైపు రాయి” ప్రతిపక్షాలపై వైసీపీ రుసరుస

HT Telugu Desk HT Telugu
Nov 05, 2022 07:33 AM IST

YCP Counter to CBN చంద్రబాబు రోడ్‌ షోలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరిన ఘటనను మంత్రి జోగి రమేష్ డ్రామాగా అభివర్ణించారు. చంద్రబాబుపై విసిరిన రాయి పసుపు రాయి కాబట్టే ఆయనకు తగల్లేదని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఎన్టీఆర్‌ జిల్లాలో జరిగిన చంద్రబాబు రోడ్‌ షోలో అగంతకుడు రాయి విసరడంతో సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడ్డాడు. ఈ ఘటనపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది.

ఏపీ మంత్రి  జోగి రమేష్
ఏపీ మంత్రి జోగి రమేష్

YCP Counter to CBN ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబుపై విసిరిన రాయి పసుపు రాయి కావడం వల్లే చంద్రబాబు కు తగల్లేదని మంత్రి జోగిరమేష్‌ ఎద్దేవా శారు. చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే అంతా జరిగిందని ఆరోపించారు. ఒక పక్కేమో రెక్కీ.. మరోవైపేమో రాయి ఎపిసోడ్‌ల వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరిదో తేల్చాలని డీజీపీని కోరుతున్నామన్నారు. ఏపీలో జరుగుతున్న విధ్వసం మొత్తం బాబు కనుసన్నల్లోనే సాగుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు.

ఇప్పటికే రెండు డ్రామాలు ముగిశాయని, పార్ట్-3 డ్రామాకు రేపు ఇప్పటం గ్రామానికి పవన్ కల్యాణ్ వస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నందిగామ సభలో మరోసారి రాయి డ్రామా ఆడారని, . ఇలా బహిరంగ సభల్లో రాయి విసిరించుకోవడం నారా చంద్రబాబు నాయుడు రాజకీయ కుట్రలో ఒక కోణమని ఆరోపించారు. ఆ రాయి విసిరిన వ్యక్తి పసుపు రంగు వ్యక్తా? ఆ రాయి పసుపుదా! అనే చర్చ జరుగుతోందన్నారు. రాజకీయాల్లో నీచమైన విషపు పురుగు చంద్రబాబు నాయుడు అని, చీఫ్ సెక్యూరిటీ అధికారికి ఆ రాయి తగలడం దురదృష్టకరమని, ఈ ఘటనకు ముందుగా క్షమాపణ కోరాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, నాటకానికి ప్రేరేపించిన చంద్రబాబు మాత్రమేనన్నారు. బహిరంగ సభలో మాట్లాడుతుంటే చంద్రబాబు మీద తామెందుకు రాయి వేస్తామని ప్రశ్నించారు.

వైఎస్ జగన్‌ణు అక్రమంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపించినా వైయస్సార్ సీపీ శ్రేణులు ఎప్పుడూ ఎలాంటి అరాచకానికిగానీ, అల్లర్లకు, ఉన్మాద కార్యక్రమాలకు పాల్పడ లేదన్నారు. శాంతియుతంగా రాజకీయాలు చేస్తూ, ప్రజల మనసులను గెలుచుకుని, 151 స్థానాలను కైవసం చేసుకున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ మోహన్ రెడ్డిగారికి వారి గుండెల్లో చోటిస్తే, తాము చంద్రబాబుపై రాళ్లు వేస్తామా? విధ్వంసం సృష్టిస్తామా? మాకెందుకు ఆ అవసరం ఉంటుందని ప్రశ్నించారు.

2024లో మా లక్ష్యం ఒక్కటేనని 175కు 175 స్థానాలు గెలచుకోవడం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరువ కావాలని మా నాయకుడు తపన పడుతున్నారని చెప్పారు. 175 స్థానాల సాధన కోసం దశ, దిశ నిర్దేశం చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో ఏదైనా బంద్ జరిగితే.. నాలుగు ఆర్టీసీ బస్సులు అయినా తగల బెట్టకపోతే అది బందే కాదని చంద్రబాబు చెప్పేవాడని, విధ్వంసకారి, దుర్మార్గుడు, రాక్షసుడైన చంద్రబాబుకు ఆ బుద్ధులన్నీ వెన్నతో పెట్టిన విద్యలని విమర్శించారు. ఒకసారి చంద్రబాబు తన చరిత్ర ఏమిటో వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదని, రాజకీయ ప్రస్థానం ఎక్కడ నుంచి ప్రారంభించి ఏ పార్టీలో చేరావో గుర్తు తెచ్చుకోవాలన్నారు.

రాయి ఘటన వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరిదో తేల్చాలని డీజీపీని కోరుతున్నామని చెప్పారు. ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యుడు అయితే ఆయన్నీ వదిలేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి దుర్మార్గపు పనులకు ఒడిగట్టే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్కరు ఉన్నారని, చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్నారు.

చంద్రబాబు నైజం వెన్నుపోటు, కుట్ర రాజకీయాలేనని విమర్శించారు. విలువలు, విశ్వసనీయతలు లేని ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమని, ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ప్రజా సమస్యలపై పోరాడతారుని చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా, సమస్యలు ఏమైనా ఉంటే ప్రస్తావించే తీరిక, ఓపిక లేకుండా, రోడ్ల మీద పడి రాళ్లు వేయించుకుంటాడని ఆరోపించారు. ఘటన వెనుక ఎవరున్నారనేది తేల్చి వారిని అరెస్ట్ చేయిస్తామని చెప్పారు.

పార్ట్-1 రెక్కీ, పార్ట్-2 రాయి విసరడం అట. అయినా పనికిమాలినవాళ్ల మీద రెక్కీలు, రాళ్ళు విసరాల్సిన అవసరం మాకేంటని జోగి రమేష్ ప్రశ్నించారు. రెక్కీ, రాళ్ళంటూ గగ్గోలు పెట్టి మీడియా ముందుకు రావడం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ రాయి సంగతి కూడా తేల్చుతామని, రాయి ఎవరు వేయమన్నారు, రాయి ఎవరితో వేయించుకున్నారు అది తెల్లరాయా? పసుపు రాయా? ఏ రాయి అన్నది కూడా తేలిపోతుందని జోగి రమేష్ చెప్పారు. చంద్రబాబు బండారం కూడా బయటపెట్టిస్తామన్నారు.

చంద్రబాబు ముందే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడని, ఉత్తరాంధ్రలో కూడా ఇలానే విధ్వంసం చేస్తానని చెబుతున్నాడని ఆరోపించారు. స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని, దానితో పాటు రాయి వేయించుకునేందుకు చంద్రబాబు రెడీ అయ్యే నందిగామ వెళ్లాడు. పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కూడబలుక్కుని నాటకాలు ఆడుతున్నారని, రేపు మళ్లీ ఇప్పటం వెళ్లి పవన్ కల్యాణ్ చేసేదేంటని ప్రశ్నించారు అక్కడ కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిపై అధికారులు మే నెలలోనే వారికి నోటీసులు ఇచ్చారని, వాటిని ఇవాళ కూలగొట్టారన్నారు. ఇళ్లు కూలిన వారిలో కాపులు, రెడ్లు, గౌడ కులాల వాళ్లు ఉన్నారని, దానీ మీద రేపు పార్ట్-3 షురూ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్ వెళితే, పవన్ హైదరాబాద్ నుంచి ఇక్కడకు వస్తాడని ఎద్దేవా చేశారు.

IPL_Entry_Point

టాపిక్