తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Eap Cet 2024: ఏపీ ఈఏపీ సెట్‌ 2024కు 3.54లక్షల దరఖాస్తులు, మే 12 వరకు పెనాల్టీతో దరఖాస్తుల స్వీకరణ

AP EAP Cet 2024: ఏపీ ఈఏపీ సెట్‌ 2024కు 3.54లక్షల దరఖాస్తులు, మే 12 వరకు పెనాల్టీతో దరఖాస్తుల స్వీకరణ

Sarath chandra.B HT Telugu

17 April 2024, 11:03 IST

    • AP EAP Cet 2024: ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్‌ 2024కు భారీగా దరఖాస్తులు  అందాయి. గతఏడాదితో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య పెరిగాయని కాకినాడ జేఎన్‌టియూ అధికారులు ప్రకటించారు. 
ఏపీ ఈఏపీ సెట్ 2024కు 3.54 లక్షల దరఖాస్తులు
ఏపీ ఈఏపీ సెట్ 2024కు 3.54 లక్షల దరఖాస్తులు

ఏపీ ఈఏపీ సెట్ 2024కు 3.54 లక్షల దరఖాస్తులు

AP EAP Cet 2024: ఆంధ్రప్రదేశ్‌ Andhra pradesh ఇంజనీరింగ్ Engineering, అగ్రికల్చర్ Agriculture, ఫార్మసీ Pharmacy కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ 2024కు 3,54,235మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 15వ తేదీతో ఈఏపీ సెట్‌ దరఖాస్తుల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. ఈ ఏడాది నిర్ణీత గడువులోగా 3,54,235మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఈఏపీ సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

AP EAPCET 2024 Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్... ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశపరీక్షకు 2,68,309మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు 84,791మంది, రెండు విభాగాల్లో 1135మంది దరఖాస్తు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈఏపీ సెట్‌ దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది.

ఈఏపీ సెట్ నిర్వహణ కోసం మొదట ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇంజనీరింగ్ విభాగంలో ఆన్‌లైన్ పరీక్షలు మే 18 నుంచి మే 22 వరకు జరగాల్సి ఉంది. దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో మే 23 తేదీన కూడా పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెల్లడించారు.

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో పరీక్షలు మే 16,17 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఏపీలో మే 13న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఈఏపీ సెట్‌ షెడ్యూల్‌ను మార్చారు.

మరోవైపు ఈఏపీ సెట్‌ దరఖాస్తుల గడువు రూ.500 ఆలస్య రుసుముతో మే ఏప్రిల్ 30వరకు, రూ.1000 ఫీజుతో మే 5వరకు, రూ.5వేల పెనాల్టీతో మే 10వరకు, రూ.10వేల పెనాల్టీతో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీ సెట్ 2024 ఆన్‌ లైన్‌ రిజిస్ట్రేషన్స్‌ online Registrations గడువు ఏప్రిల్‌ 15తో ముగిసింది. ఏపీ ఉన్నత విద్యా మండలి APSCHE షెడ్యూల్‌ ప్రకారం జేఎన్‌టియూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ ఏడాది ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 12వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు.

ఈఏపీ సెట్ 2024 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను కాకినాడ జేఎన్‌టియూ JNTU Kakinada మార్చి 15న అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ నిర్వహిస్తున్నారు.

ఈఏపీ సెట్‌ 2024 పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్( డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ), బిఎస్సీ అగ్రికల్చర్/ హార్టీకల్చర్, బీవిఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ, బిఎస్సీ నర్సింగ్, బిఎస్సీ(సిఏ అండ్ బిఎం) విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

విద్యార్ధులు సాధించే ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. డీమ్డ్ యూనివర్శిటీల్లో కూడా 25శాతం కోటాలను భర్తీ చేస్తారు. పరీక్ష సిలబస్, మోడల్ పేపర్ల కోసం వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

విద్యార్హతలు...

కనీసం 45శాతం మార్కులతో మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ తత్సమానమైన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో ఒకేషనల్ ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. ఇంటర్ రెండో ఏడాది పరీక్షకు హాజరవుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈఏపీ సెట్‌ 2024ను ఆన్‌లైన్‌ పద్ధతిలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఇంజనీరింగ్‌ విభాగంలో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఇందులో మ్యాథ్స్‌ నుంచి 80ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌లో 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు.

ఇందులో బోటనీ నుంచి 40, జువాలజీ నుంచి 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీలో 40 ప్రశ్నలు ఉంటాయి. కనీస అర్హతగా 25మార్కులు సాధించాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ఇలా....

ఈఏపీ సెట్ 2024కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులకు సంబంధించిన అర్హతలు, ఫీజు చెల్లింపుకు సంబంధించిన విధివిధానాలను స్టెప్‌1 లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

రెండో దశలో ఫీజు చెల్లింపు స్టేటస్ తెలుస్తుంది.

మూడో దశలో ఫీజు చెల్లించిన అభ్యర్థులకు దరఖాస్తు పూరించాల్సి ఉంటుంది.

నాలుగో దశలో దరఖాస్తులో పేర్కొన్న వివరాలు, అక్షరదోషాలు, అర్హతలు, మార్కుల వివరాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఐదో దశలో పూర్తి చేసిన అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం