ఏపీ రాజకీయాలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీని టెర్రరిస్టు అన్న బాబుతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ తన మిత్రుడని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. జగన్ తో మంచి మిత్రుత్వం ఉందన్నారు. CAA చట్టం అమలుపైనా మాట్లాడిన అసదుద్దీన్.. ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఏఏపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని అసదుద్ధీన్ తెలిపారు.