India China Tawang Clash: భారత్‍కు అమెరికా మద్దతు.. చైనాకు చురక అంటేలా పెంటగాన్ వ్యాఖ్యలు-india china clash us pentagon backs india on tawang clash ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  India China Tawang Clash: భారత్‍కు అమెరికా మద్దతు.. చైనాకు చురక అంటేలా పెంటగాన్ వ్యాఖ్యలు

India China Tawang Clash: భారత్‍కు అమెరికా మద్దతు.. చైనాకు చురక అంటేలా పెంటగాన్ వ్యాఖ్యలు

Dec 14, 2022 01:24 PM IST Chatakonda Krishna Prakash
Dec 14, 2022 01:24 PM IST

India China Tawang Clash: భారత్, చైనా దళాల మధ్య తవాంగ్ వద్ద జరిగిన ఘర్షణపై అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ స్పందించింది. భారత్‍కు మద్దతుగా మాట్లాడింది. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‍హౌస్ కాస్త ఆచితూచి స్పందించగా.. పెంటగాన్ మాత్రం మిత్రపక్షం ఇండియాకు మద్దతుగా నిలిచింది. ఘర్షణ సద్దుమణిగేలా భారత్ చేపట్టిన చర్యలకు తమ మద్దతు ఉంటుందని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ ప్యాట్రిక్ రైడర్ వెల్లడించారు. అంటే చైనానే సరిహద్దు దాటిందనేలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. డ్రాగన్ దేశానికి చురక అంటించారు. అలాగే ఇరు దేశాలు చర్చల ద్వారా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.

More