NTR on Dance Performance: ఆస్కార్ వేదికపై డ్యాన్స్ ప్రదర్శనపై తారక్ క్లారిటీ.. ఏమన్నారంటే?
NTR on Dance Performance: 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఆ వేదికపై డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌పై తారక్ క్లారిటీ ఇచ్చారు. అక్కడ డ్యాన్స్ చేయడం కష్టమే అంటూ సమాధానమిచ్చారు.
NTR on Dance Performance: ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తోంది. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 12 నుంచి జరగనున్న తరుణంలో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ముందుగా రామ్ చరణ్, రాజమౌళి ఇప్పటికే అక్కడికి వెళ్లగా ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లి అక్కడ అభిమానులతో ముచ్చుటిస్తున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఇందులో భాగం పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆస్కార్ వేదికపై తను, చరణ్ నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు.
“నాటు నాటు పాటను లైవ్ ప్రదర్శన చూడాలని ఆసక్తిగా చూస్తున్నాము. మేము ఆ పాటకు డ్యాన్స్ చేస్తామని కచ్చితంగా చెప్పలేను. చేయాలని నాకు కూడా ఆషగాఉంది. కానీ దురదృష్టవశాత్తు పాటకు రిహార్సల్ చేయడానికి మాకు తగినంత సమయం దొరకడం లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద వేదికైన ఆస్కార్‌కు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మేము వెళ్లాలనుకోవడం లేదు. ప్రస్తుతం మేము చాలా బిజీగా ఉన్నాం.” అని ఎన్టీఆర్ అన్నారు.
నాటు నాటు పాట చిత్రీకరణ సమయంలో తన అనభవాన్ని కూడా తారక్ పంచుకున్నారు. "ఈ పాట షూట్ చేసేటప్పుడు మా బాధను మీరు ఊహించి ఉండరు. నా కాళ్లు ఇప్పుటికీ నొప్పిగానే ఉన్నాయి. నాటు నాటు స్టెప్పులు సులభంగానే ఉంటాయి. కానీ సింక్రనైజేషన్ కోసమే చాలా కష్టపడ్డాం. మేము ప్రతి రోజు మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేశాం. కేవలం సింక్రనైజేషన్ కోసమే షూట్ కంటే ముందు ఓ వారం పాటు రిహార్సల్ చేశాం." అని ఎన్టీఆర్ సాంగ్ గురించి తెలియజేశారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ హవానే నడుస్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ కావడంతో సోషల్ మీడియాలో ఫుల్ బజ్ ఏర్పడింది. ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ సైతం అమెరికాకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 12న జరగనుంది.