TS Assembly Elections : ఆ ఇద్దరికి 'హస్తం' టికెట్లు దక్కుతాయా? లేక హ్యాండ్ ఇస్తారా..?
Adilabad Politics : ఆపరేషన్ ఆకర్ష్ తో కీలక నేతలను తమవైపు తిప్పుకుంటోంది కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న హస్తం పార్టీ… మరిన్ని చేరికలు ఉంటాయని చెబుతోంది. అయితే ఎమ్మెల్యే రేఖానాయక్ దంపతులకు
Telangana Assembly Elections 2023: రాజకీయాలు హస్తిన కేంద్రంగా రసవతంగా మారుతున్నాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఓవైపు కాంగ్రెస్ పెద్దలు తొలి జాబితా వచ్చేనెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్టు తెలపడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో మహిళా బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్రంలోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని బలమైన స్థానాలకు మహిళలకు కేటాయించాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బలమైన మహిళ నేతలు లేరనే వాగనాలు వినిపిస్తున్నాయి.
ఇందుకుగాను మంచిర్యాల స్థానం నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ, చెన్నూరులో నల్లాల ఓదెలు సతీమణి భాగ్యలక్ష్మి లను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో ఒక్కొక్క స్థానానికి పదుల సంఖ్యలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా కాంగ్రెస్ పెద్దలు వడపోసి ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు చొప్పున నివేదికను తయారుచేసి ఢిల్లీ అధిష్టానానికి చేరవేసినట్లు సమాచారం. ఆ ముగ్గురిలో తమ పేర్లు ఉంటాయా లేదా అనేది ఆశవహు ల్లో ఉత్కంఠ నెలకొంది.
ఆ ఇద్దరికీ టికెట్ దక్కుతుందా..?
ఇదిలా ఉంటే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ, ఆసిఫాబాద్ అసెంబ్లీ పై కన్నేసిన భార్యాభర్తల కు హస్తం పార్టీ చేయందిస్తుందా... చేయిస్తారా అనేది ఉత్కంఠంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో మొదటి జాబితాలోనే టికెట్ పొందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఆమె భర్త శ్యాం నాయక్ రెండు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్లు ఆశిస్తున్నారు, బీఆర్ ఎస్ పార్టీ నుండి బయటికి వస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్టానానికి ముందే తెలపడంతో ఆమె టికెట్ రిజర్వైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆమె భర్త శ్యాం నాయక్ ఆర్టీవో పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరగా ఆసిఫాబాద్ టికెట్ తనకే కేటాయిస్తున్నట్లు ప్రకటించుకుంటున్నాడు, ఇప్పటికే టిఆర్ఎస్ ఎమ్మెల్యే లు మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే వీరేశం కాంగ్రెస్ గూటికి చేరగా, ఎమ్మెల్యే రేఖా నాయక్ సైతం అధికారికంగా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గోండు సామాజిక వర్గానికి అదిలాబాదులో టికెట్లు కేటాయించాలని ఆ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఈ క్రమంలో ఎస్టీ రిజర్వుడ్ గా ఉన్న ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గం లో తొలినుంచి ఆ వర్గానికి సంబంధించిన నాయకులు పార్టీలో పనిచేస్తున్నారు. వారికి కాదని ఆదిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
రిపోర్టర్ : కామోజీ వేణుగోపాల్, ఆదిలాబాద్
సంబంధిత కథనం