TS Weather Updates : మండే ఎండల్లో తెలంగాణకు చల్లటి కబురు... మే 20 నుంచి మళ్లీ వర్షాలు!-weather updates of telangana and rain alert to various districts from 20 may 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Weather Updates : మండే ఎండల్లో తెలంగాణకు చల్లటి కబురు... మే 20 నుంచి మళ్లీ వర్షాలు!

TS Weather Updates : మండే ఎండల్లో తెలంగాణకు చల్లటి కబురు... మే 20 నుంచి మళ్లీ వర్షాలు!

HT Telugu Desk HT Telugu
May 18, 2023 03:39 PM IST

Telangana Weather Updates: మండే ఎండల్లో చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. మే 20 నుంచి మళ్లీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.

తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

Telangana Weather Updates: గత కొద్దిరోజులుగా భానుడి దాటికి ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో ఏకంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే మండే ఎండల్లో తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. మే 20వ తేదీ నుంచి మళ్లీ వర్షాలు పడుతాయని పేర్కొంది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడగా... మరికొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఇచ్చింది. ఈ మేరకు తాజాగా బులెటిన్ విడుదల చేసింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్
హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్

ప్రస్తుతం తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే మే 20వ తేదీ వర్షాలు పడుతాయని సూచించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక మే 21వ తేదీన నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని ప్రకటించింది. 22వ తేదీన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని స్పష్టం చేసింది. ఆయా జిల్లాలకు ఎఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఇక మే 23వ తేదీన కూడా పైన పేర్కొన్న జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని పేర్కొంది.

నైరుతిపై ఐఎండీ ప్రకటన….

IMD Monsoon prediction: రుతు పవనాల (Monsoon) రాకపై భారత వాతావరణ విభాగం (India Meteorological Department IMD) కీలక ప్రకటన చేసింది. కేరళకు నైరుతి రుతుపవనాలు జూన్ 4 వ తేదీ వరకు చేరుతాయని వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతు పవనాలు (southwest monsoon) కేరళకు జూన్ 1వ తేదీ వరకు చేరుతాయి. ఈ సంవత్సరం అవి జూన్ 4 (model error of +/-4 days)వరకు కేరళకు వస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది.2015లో మినహాయిస్తే, రుతు పవనాల రాకపై ఐఎండీ (IMD) అంచనా గత 18 ఏళ్లలో ఇంతవరకు తప్పలేదు. గత సంవత్సరం నైరుతి రుతుపవనాలు (southwest monsoon) రెండు రోజులు అటుఇటుగా మే 27న కేరళకు చేరుతాయని ఐఎండీ (IMD) అంచనా వేసింది. అవి మే 29న కేరళకు చేరాయి. అలాగే 2021లో మే 31న భారత్ కు చేరుతాయని ఐఎండీ అంచనా వేయగా, అవి జూన్ 3వ తేదీన చేరాయి. నైరుతి రుతుపవనాల రాకతో భారత్ లో వర్షకాలం ప్రారంభమవుతుంది. రుతుపవనాల ఆగమనం ఆధారంగా రైతులు తమ వ్యవసాయ కార్యక్రమాలకు సిద్ధమవుతారు.

ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ (IMD) వెల్లడించింది. దీర్ఘకాలిక సగటు (long period average LPA) ప్రకారం ఈ సంవత్సరం 96% (+/-5%) వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. సాధారణ వర్షపాతం నమోదు కావడానికి 35% అవకాశం ఉండగా, సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడానికి 29% అవకాశం, అతి తక్కువ వర్షపాతం నమోదు కావడానికి 22% అవకాశం, సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి 11% అవకాశం, అత్యధిక వర్షపాతం నమోదు కావడానికి 03% అవకాశం ఉందని ఐఎండీ (IMD) వివరించింది. మరోవైపు, ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థ స్కై మెట్ (skymet) ఈ సంవత్సరం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదువుతుందని ప్రకటించింది.

Whats_app_banner

సంబంధిత కథనం