Hyderabad : నకిలీ రూ. 500 నోట్ల తయారీ - పోలీసులకు చిక్కిన నిందితులు-two accused who were printing and circulating fake currency notes in the hyderabad city were arrested ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : నకిలీ రూ. 500 నోట్ల తయారీ - పోలీసులకు చిక్కిన నిందితులు

Hyderabad : నకిలీ రూ. 500 నోట్ల తయారీ - పోలీసులకు చిక్కిన నిందితులు

HT Telugu Desk HT Telugu
Feb 04, 2024 12:27 PM IST

Hyderabad Crime News: ఫేక్ కరెన్సీ నోట్లను ముద్రించి మార్కెట్ లోకి సరఫరా చేస్తున్న ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు హైదరాబాద్ నగర పోలీసులు. వీరి వద్ద నుంచి ప్రింటర్లతో పాటు నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ నోట్లు
నకిలీ నోట్లు

Hyderabad Crime News: ప్రజలను మోసం చేసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ 500 రూపాయలను నోట్లు ముద్రించి మార్కెట్ లో చలామణి చేస్తున్న ఇద్దరు నిందితులను బాలనగర్ ఎస్ఓటి మరియు అల్లాపుర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లాపూర్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.....హైదరాబాద్ లోని బోడుప్పల్, మారుతి నగర్ లో నివాసం ఉండే వనం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి.గచ్చిబౌలి మసీదుబండ లో నివాసం ఉండే ఎరుపుల ప్రణయ్ కుమార్ (26) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.అయితే గతంలో బొడుప్పల్ కు చెందిన వనం లక్ష్మీనారాయణ నకిలీ బంగారాన్ని తనక పెట్టి బ్యాంక్ ను మోసం మోసం చేసిన కేసులో అతడి పై కేసు నమోదు అయింది. అతడి ఆర్థిక పరిస్థితి కూడా బాగుండకపోవడంతో అప్పటి నుండి డబ్బును సులభంగా సంపాదించేందుకు నకిలీ బంగారం,నకిలీ కరెన్సీ సృష్టించి చలామణి చేయాలని నిర్ణయించుకున్నాడు.

yearly horoscope entry point

కంప్యూటర్, ప్రింటర్ల గురించి పూర్తి స్థాయిలో పరిజ్ఞానం ఉండడంతో 500 రూపాయల నకిలీ నోట్లను వనం లక్ష్మీనారాయణ ప్రింటింగ్ చేశాడు. నకిలీ కరెన్సీని ముద్రించిన తర్వాత మరో నిందితుడు ఎరుకల ప్రణయ్ కుమార్ తో పరిచయం చేసుకొని నకిలీ కరెన్సీ గురించి చెప్పి వాటిని మార్కెట్ లో మార్పించేందుకు సహాయ పడితే వాటా ఇస్తానన్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో వీరు ఇద్దరు కలిసి 500 నకిలీ కరెన్సీ చలామణి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వీరిద్దరని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వాటి నుంచి నకిలీ కరెన్సీ తయారీ కి సంబంధించిన కంప్యూటర్లు,ప్రింటర్లు,ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మొత్తం 810 నకిలీ కరెన్సీ నోట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూకట్ పల్లి ఏసిపి శివ భాస్కర్ ,ఆల్లాపుర్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు,ఎస్సై మాల్య నాయక్ మరియు బాలానగర్ పోలీసుల పర్యవేక్షణలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

డ్రగ్స్ ముఠా అరెస్ట్.....

Drugs Gang Arrest in Hyderabad: ముగ్గురు డ్రగ్స్ విక్రయితలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి సిఐ జేమ్స్ బాబు తెలిపిన వివరాలు ప్రకారం..... యూసఫ్ గూడాకు చెందిన సులేమాన్ అబుబాకర్ అలియాస్ వాసిం, హిమాయత్ నగర్ కు చెందిన షేక్ అర్మన్,బంజారా హిల్స్ కు చెందిన హుసైన గత రెండేళ్లుగా....బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లోని పలు పబ్బులో విక్రయిస్తున్నారు. నిఓటల్ ఆర్టిస్ట్రి,ఎయిర్ లైవ్ పబ్,క్లబ్ రాక్ లో కొకైన్ గ్రాము రూ.15 వేలు,గ్రాము ఎండీఎంఎ రూ.8వేలకు విక్రయించారు.

ఈ క్రమంలోనే క్లబ్లో నిజాంపేట కు చెందిన మిధున అనే మహిళతో సులేమాన్ కు పరిచయం ఏర్పడింది.ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడడంతో డ్రగ్స్ డ్రగ్స్ ను ఆమెకు సులేమాన్ఉ చితంగా ఇచ్చేవాడు.ఆమెతోపాటు ఆమె స్నేహితులకు కూడా సులేమాన్ డ్రగ్స్ విక్రయించేవాడు.ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి.అప్పటినుంచి సులేమాన్ ఆ మహిళను వేధించడం మొదలుపెట్టాడు.

ఒకవైపు సులేమాన్ వేధింపులు,మరోవైపు ఆరోగ్యం క్షణించడంతో మహిళా షీ టీంను ఆశ్రయించింది. వారి సూచనలతో టీఎస్ న్యాబ్ సిబ్బందిని కలిసి సులేమాన్ గురించి చెప్పింది.జనవరి 30న బెంగళూరుకు వెళ్లిన సులేమాన్, అబూకార్లు అజిం అనే వ్యక్తి వద్ద 10 గ్రాముల కొకైన్,13 గ్రాముల ఎండీఎంఎ కొనుగోలు చేశారు. ఫిబ్రవరి 2న మిధున రెండు గ్రాముల కొకైన్ కావాలని సులేమాన్ ను కోరింది.దీంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద మహిళకు కొకైన్ సరఫరా చేసేందుకు సులేమాన్ మరియు వసీం లు వచ్చారు. అప్పటికే మాటు వేసి ఉన్న గచ్చిబౌలి పోలీసులు, టిఎస్ న్యాబ్,ఎస్ఓటి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 26 లక్షల విలువ చేసే పది గ్రాముల కోకేన్ 13 గ్రాముల ఎండిఎంఏ ,స్కోడా, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు వచ్చిన కెపిహెచ్పి కి చెందిన కోసగల ప్రియ బంజరహిల్స్కు చెందిన డాక్టర్ చల్లా చైతన్యలకు 41 నోటీసులు జారీ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా.

Whats_app_banner