TSRTC Jobs 2024 : ఉద్యోగాల భర్తీకి టీఎస్ఆర్టీసీ ప్రకటన - కేవలం ఇంటర్వూనే, ముఖ్య వివరాలివే-tsrtc invitie applications for filling various jobs at tarnaka nursing college 2024 check key details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tsrtc Invitie Applications For Filling Various Jobs At Tarnaka Nursing College 2024 Check Key Details Are Here

TSRTC Jobs 2024 : ఉద్యోగాల భర్తీకి టీఎస్ఆర్టీసీ ప్రకటన - కేవలం ఇంటర్వూనే, ముఖ్య వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 29, 2024 02:59 PM IST

TSRTC Recruitment Notification 2024: పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది తెలంగాణ ఆర్టీసీ. తార్నాకలోని నర్సింగ్ కాలేజీలో ఈ ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. కేవలం ఇంటర్వూ ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు 2024
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు 2024 (https://tsrtc.telangana.gov.in/index.php)

TSRTC Recruitment Notification 2024: తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాకలో నర్సింగ్ కళాశాల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఆర్టీసీ. ఇందులో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులు ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ విధానంలో వీటిని భర్తీ చేయనున్నట్లు ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 4వ తేదీన తార్నాకలోని కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్య్వూలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు http://tsrtc.telangana.gov.in వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు… 7075009463, 8885027780 ఫోన్‌ నంబర్లను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్య వివరాలు:

రిక్రూట్ మెంట్ ప్రకటన - తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.

ఉద్యోగాలు - తార్నాకలోని నర్సింగ్ కళాశాల.

ఖాళీల వివరాలు - ప్రొఫెసర్ -01, అసిస్టెంట్ ప్రొఫెసర్ -03, ట్యూటర్ - 02.

అర్హతలు - ఎంఎస్సీ నర్సింగ్ చేయటంతో పాటు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

జీతం - రూ. 20 వేల నుంచి రూ. 50వేలు

ఎంపిక విధానం - కేవలం ఇంటర్వూనే

ఇంటర్వూ తేదీ - మార్చి 04, 2024

సమయం - ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వూలు నిర్వహిస్తారు.

ఈ ఇంటర్వూలను తార్నాకలోని టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కాలేజీలో నిర్వహిస్తారు.

అధికారిక వెబ్ సైట్ - https://tsrtc.telangana.gov.in/index.php

సంప్రదించాల్సిన ఫొన్ నెంబర్లు - 7075009463, 8885027780

IPL_Entry_Point