TSRTC: విద్యార్థులకు అలర్ట్… టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లు - వివరాలివే-tsrtc inviting applications for bsc nursing admissions 2023 2024
Telugu News  /  Telangana  /  Tsrtc Inviting Applications For Bsc Nursing Admissions 2023- 2024
ఎస్ఆర్టీసీ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లు
ఎస్ఆర్టీసీ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లు

TSRTC: విద్యార్థులకు అలర్ట్… టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లు - వివరాలివే

26 May 2023, 21:08 ISTMaheshwaram Mahendra Chary
26 May 2023, 21:08 IST

TSRTC Nursing College: ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.

TSRTC Nursing College Admissions 2023: టీఎస్ఆర్టీసీ... వినూత్న నిర్ణయాలతో ప్రయాణికులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించింది. ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్టీసీ… ఒకేషనల్ జూనియర్ కాలేజీతో పాటు నర్సింగ్ కళాశాలను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నర్సింగ్ కాలేజీలో మేనేజ్ మెంట్ కోటాలో అడ్మిషన్ల కోసం అప్లికేషన్స్ ను ఆహ్వానించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

తార్నాక టీఎస్ ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్ మెంట్ కోటాలో http://B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు కల్పించనుంది. నాలుగేళ్ళ కోర్సులో చేరడానికి ఇంటర్ బైపీసీ ఉతీర్ణులైన 17 ఏళ్లు నిండిన విద్యార్థినులు అర్హులు అవుతారని పేర్కొంది. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624, 7893370707 సంప్రదించవచ్చు.

కొత్తగా 'జనరల్ రూట్ పాస్'…

ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణాలు చేసే వారికి సరికొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. కొత్తగా ‘జనరల్ రూట్ పాస్’కు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’కు టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ కు రూ.600గా, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1000 గా ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటగా హైదరాబాద్ లోని 162 రూట్లలో ఈ పాస్ ను ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ రూట్ పాస్ దారులు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలువు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్ తో ప్రయాణించవచ్చు.

హైదరాబాద్ లో ప్రయాణికులకు జనరల్ బస్ టికెట్ అందుబాటులో ఉంది. ఆర్డినరీ బస్ పాస్ కు రూ.1150, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ కు రూ.1300గా ధర ఉంది. ఈ పాస్ దారులు సిటీ సబర్బన్ పరిధిలో తిరిగే అన్ని బస్సుల్లోనూ ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ పాస్ లను కొనుగోలు చేస్తున్నారని సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తేలింది. తక్కువ దూరం ప్రయాణించే వారికి చేరువ కావడం కోసమే జనరల్ రూట్ పాస్ ను టీఎస్ఆర్టీసీ రూపొందించింది.