TSPSC Group 4 Results : త్వరలో గ్రూప్ 4 ఫలితాలు..!-tspsc is exercise to release group 4 exam results soon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 4 Results : త్వరలో గ్రూప్ 4 ఫలితాలు..!

TSPSC Group 4 Results : త్వరలో గ్రూప్ 4 ఫలితాలు..!

HT Telugu Desk HT Telugu
Jan 31, 2024 02:37 PM IST

TSPSC Group 4 Results Updates: కొత్తగా కొలువుదీరిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా… త్వరలోనే గ్రూప్ - 4 ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.

తెలంగాణలో గ్రూప్ 4 ఫలితాలు
తెలంగాణలో గ్రూప్ 4 ఫలితాలు

TSPSC Group 4 Results: ఇటీవల నియామకమైన కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు ఆగిపోయిన పనుల్లో కదలిక స్టార్ట్ అయింది. ఇప్పటికే పూర్తైన రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు ప్రారంభించింది.ప్రభుత్వం అనుమతి తీసుకోని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్-4 ఫలితాలు విడుదల చేసేందుకు ముమ్మరం చేసింది. అయితే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిఎస్పిఎస్సి చైర్మన్ సహా సభ్యులు రాజీనామా చేయడంతో వాటిని గవర్నర్ తమిలసై ఆమోదించిన రెండు రోజుల్లోనే కమిషన్ కు

yearly horoscope entry point

కొత్త చైర్మన్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. టీఎస్పీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలను చైర్మన్ మహేందర్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలో ఈ కమిషన్ తొలి సమావేశం నిర్వహించనుంది. అయితే గ్రూప్ -1 నోటిఫికేషన్ 503 పోస్టులతో విడుదల చేశారు.ఈ పరీక్షకు 3.80 లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు.అయితే రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్ష జరగా......తొలిసారి పేపర్ లీక్కా వడంతో ఆ పరీక్ష రద్దు చేయగా...... రెండోసారి పరీక్షను సక్రమంగా నిర్వహించలేదని హైకోర్టు పరీక్షను కేన్సిల్ చేసింది. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టు టిఎస్పిఎస్సి కేసు వేసింది. అయితే ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో సుప్రీం కోర్టులో కేసును వెనక్కు తీసుకునే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు గ్రూప్ -1 పోస్టుల ఖాళీల వివరాలను ఇవ్వాలని స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుందనే ఆశల్లో నిరుద్యోగులు ఉన్నారు.

ఇక రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ - 4 నోటిఫికేషన్ ఇవ్వగా..... జూలై 1న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది అప్లై చేయగా....అందులో 7,62,872 మంది పేపర్ -1 రాయగా....7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు.ఇక 5 నెలల క్రిందటే ఫైనల్ కీ విడుదల కాగా....గ్రూప్ -4 తుది ఫలితాలు మాత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు. అయితే ఫలితాలు విడుదల చేసే ప్రక్రియ మాత్రం బోర్డు పూర్తి చేయగా...మరో వారం రోజుల్లో గ్రూప్ - 4 ఫలితాలను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. ముందుగా జనరల్ ర్యాంకు లిస్టును ప్రకటించి...... ఆ తర్వాత పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకు కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్లవారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner