TSGENCO Recruitment : తెలంగాణ జెన్‌కోలో AE, కెమిస్ట్ ఉద్యోగాలు - దరఖాస్తుల గడువు పెంపు, పరీక్ష తేదీ మార్పు-tsgenco ae and chemist recruitment 2023 application date extended check key details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsgenco Recruitment : తెలంగాణ జెన్‌కోలో Ae, కెమిస్ట్ ఉద్యోగాలు - దరఖాస్తుల గడువు పెంపు, పరీక్ష తేదీ మార్పు

TSGENCO Recruitment : తెలంగాణ జెన్‌కోలో AE, కెమిస్ట్ ఉద్యోగాలు - దరఖాస్తుల గడువు పెంపు, పరీక్ష తేదీ మార్పు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 25, 2023 10:13 AM IST

TSGENCO Recruitment 2023 Updates: నిరుద్యోగులకు అలర్ట్ ఇచ్చింది టీఎస్ జెన్ కో. అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తుల గడువును పొడిగించినట్లు పేర్కొంది. పరీక్ష తేదీలను కూడా మార్చింది.

టీఎస్ జెన్ కో ఉద్యోగాలు
టీఎస్ జెన్ కో ఉద్యోగాలు

TSGENCO Recruitment 2023: ఇటీవలే తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ నుంచి రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిిసిందే. ఇందులో భాగంగా 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులుతో పాటు 60 కెమిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఏఈ ఉద్యోగాల్లో చూస్తే లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా…. అక్టోబరు 29వ తేదీతో గడువు ముగియనుంది. అయితే దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది జెన్ కో యాజమాన్యం. దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కొత్త తేదీలను ప్రకటించింది. పరీక్ష తేదీలను కూడా మార్చింది.

yearly horoscope entry point

ముఖ్య వివరాలు :

భర్తీ చేసే సంస్థ - తెలంగాణ జెన్ కో

ఉద్యోగాలు - అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)

మొత్తం ఖాళీల సంఖ్య - 339 (లిమిటెడ్-94, జనరల్-245)

అర్హత- సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి- 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్

దరఖాస్తులు ప్రారంభం - అక్టోబరు 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.

దరఖాస్తు రుసుం - దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం - రాతపరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం - మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది.

జీతం - రూ.65,600 - రూ.1,31,220 (RPS-2022).

ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు తుది గడువు - 10.నవంబరు.2023

దరఖాస్తు సవరణకు అవకాశం: 14.11.2023 - 15.11. 2023

హాల్‌టికెట్లు: పరీక్షకు 7 రోజుల ముందు

ఎగ్జామ్ నిర్వహించే తేదీ: 07.డిసెంబర్.2023

అధికారిక వెబ్ సైట్ - https://tsgenco.co.in/TSGENCO/home.do

కెమిస్ట్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలు :

భర్తీ చేసే సంస్థ - తెలంగాణ జెన్ కో

ఉద్యోగాలు - కెమిస్ట్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య - 60(లిమిటెడ్ రిక్రూట్ మెంట్3, జనరల్ రిక్రూట్ మెంట్ 57)

అర్హత- ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి - 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్

దరఖాస్తులు ప్రారంభం - అక్టోబరు 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.

దరఖాస్తు, పరీక్ష రుసుం - దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం - రాతపరీక్ష ఆధారంగా

పరీక్ష విధానం - మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 80 మార్కులకు సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడగగా.. మిగతా 20 మార్కులు ఇంగ్లీష్, జనరల్ అవర్ నెస్, తెలంగాణ సంస్కృతితో పాటు పలు అంశాల నుంచి అడుగుతారు.

ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు తుది గడువు - 10.నవంబరు.2023

దరఖాస్తు సవరణకు అవకాశం: 14.11.2023 - 15.11. 2023

హాల్‌టికెట్లు: పరీక్షకు 7 రోజుల ముందు

ఎగ్జామ్ నిర్వహించే తేదీ: 07.డిసెంబర్.2023

అధికారిక వెబ్ సైట్ - https://tsgenco.co.in/TSGENCO/home.do

Whats_app_banner

సంబంధిత కథనం