DA hike news : రైల్వే ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. మరింత పెరిగిన 'డీఏ'!-7th pay commission dearness allowance da for railway employees hiked by 4 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Da Hike News : రైల్వే ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. మరింత పెరిగిన 'డీఏ'!

DA hike news : రైల్వే ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. మరింత పెరిగిన 'డీఏ'!

Sharath Chitturi HT Telugu
Oct 24, 2023 02:30 PM IST

DA hike news : ఉద్యోగుల డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది రైల్వే బోర్డు. 4శాతం డీఏను పెంచింది. ఇది జులై నుంచి అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది.

రైల్వే ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. మరింత పెరిగిన 'డీఏ'!
రైల్వే ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. మరింత పెరిగిన 'డీఏ'!

Railway employees DA hike : పండుగ సీజన్​ నేపథ్యంలో తమ ఉద్యోగులకు డీఏను పెంచుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే గుడ్​ న్యూస్​ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. ఇదే విషయంపై రైల్వే బోర్డు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ఉద్యోగుల డీఏను పెంచేందుకు నిర్ణయించింది. ఫలితంగా.. ఇప్పటివరకు 42శాతంగా ఉన్న డీఏ (డియర్​నెస్​ అలొవెన్స్​).. 46శాతానికి పెరిగింది. అంటే ఒకేసారి 4శాతం పెరిగినట్టు! ఈ మేరకు ఒక సర్క్యులర్​ను విడుదల చేసింది రైల్వే బోర్డు.

yearly horoscope entry point

"రైల్వే ఉద్యోగుల డీఏను.. బేసిక్​ పేలో 42శాతం నుంచి 46శాతానికి పెంచుతున్నాము. పెంచిన ఈ డీఏ.. 2023 జులై 1న అమల్లోకి వచ్చింది," అని సర్క్యులర్​లో స్పష్టం చేసింది రైల్వే బోర్డు.

DA hike news latest : కేంద్రం ఆమోదించిన 7వ సీపీసీ సఫార్సులను పరిగణించి.. రైల్వే ఉద్యోగులకు డీఏను పెంచినట్టు బోర్డు వెల్లడించింది. కానీ స్పెషల్​ పే వంటి ఇతర అలొవెన్స్​లు ఈసారి పెరగలేదు. కేవలం డీఏ ఒక్కటే పెరిగింది.

జులై నుంచి అక్టోబర్​ వరకు సంబంధించిన డీఏ ఏరియర్స్​.. నవంబర్​ 1న శాలరీలో క్రెడిట్​ అవుతాయి. దీపావళి ముందే ఈ నగదు ఉద్యోగుల చేతికి అందుతుండటం సంతోషకరమైన విషయం అని ఆల్​ ఇండియా రైల్వేమెన్స్​ ఫెడరేషన్​ జనరల్​ సెక్రటరీ శివ గోపాల్​ మిశ్రా తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. కానీ!

కొన్ని రోజుల క్రితం.. కేంద్రం ప్రభుత్వం తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. డీఏని 4శాతం పెంచడం సహా రూ. 15వేల కోట్ల బోనస్​ను ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. దీపావళి బోనస్ గా ఒక నెల బేసిక్ సాలరీని, గరిష్టంగా రూ. 7 వేల వరకు, ఉద్యోగులు పొందుతారు. అయితే, ఈ బోనస్ కేంద్ర ప్రభుత్వ గ్రూప్ సీ ఉద్యోగులకు, గ్రూప్ బీ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు, కేంద్ర పారా మిలటరీ, సాయుధ దళాల్లోని అర్హులైన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ దీపావళి బోనస్ ను పొందడానికి ఉద్యోగులు మార్చి 31, 2023 నాటికి ఉద్యోగ విధుల్లో ఉండాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం