TS Inter Supply Results 2024 : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు - ఫలితాలు ఎప్పుడంటే..?-ts inter 1st and 2nd year supplementary result 2024 is likely to announce on 25 june or 27 latest updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Supply Results 2024 : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు - ఫలితాలు ఎప్పుడంటే..?

TS Inter Supply Results 2024 : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు - ఫలితాలు ఎప్పుడంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 19, 2024 09:39 AM IST

Telangana Inter Supply Results 2024 : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే వారంలో రిజల్ట్స్ ను ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2024
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2024

Telangana Inter Supply Results 2024 : ఓవైపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్, మరోవైపు దోస్త్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ పరీక్షలు గత నెల 24వ తేదీ నుంచి ప్రారంభమై…జూన్ 3వ తేదీతో ముగిశాయి.

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫెయిల్ అయిన వారితో పాటు ఇంప్రూవ్ మెంట్ రాసిన వారు కూడా ఉన్నారు. వీరంతా కూడా ఫలితాలను బట్టి… ఇంజినీరింగ్ లేదా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫలితాలు ఎప్పుడు వస్తాయా..? అని ఎదురుచూస్తున్నారు.

ఫలితాలు ఎప్పుడంటే…?

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి బోర్డు అధికారులు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూల్యాంకాన ప్రక్రియ పూర్తి అయింది. సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. ఆన్ లైన్ లో మార్కుల ఎంట్రీతో పాటు మరికొన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఫలితాలను వచ్చే వారం విడుదల చేస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి ప్రాథమికంగా 25 లేదా 27 తేదీలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మధ్యలో ఉండే 26వ తేదీన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఫలితాల విడుదలకు సంబంధించి అధికారికంగా ప్రకటన రానుంది.

TS Inter Supplementary Results 2024 - ఫలితాల లింక్ ఇదే

  • ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ - 2024 ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీరు ఏ ఇయర్ పరీక్ష రాశారో అక్కడ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి… మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.

ఏపీలో ఫలితాలు విడుదల….

మరోవైపు ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ 2024 సెకండియర్ ఫలితాలను మంగళవారం(జూన్ 18) మధ్యాహ్నం బోర్డు విడుదల చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.

జూన్ 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను బోర్డు విడుదల చేసింది. మే 24 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా 861 కేంద్రాల్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ ఏడాది దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2024 ఇలా చెక్ చేసుకోండి?

Step 1: ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/Index.do పై క్లిక్ చేయండి.

Step 2: హోమ్ పేజీలో ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.

Step 3: సెకండియర్ జనరల్ లేదా వొకేషనల్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.

Step 4: విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.

Step 5: మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తాయి.

Step 6: భవిష్యత్ రిఫరెన్స్ కోసం ఫలితాలు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

Whats_app_banner