TG Inter Colleges Reopen : జూన్ 1 నుంచి తెలంగాణ ఇంటర్ తరగతులు ప్రారంభం
- Telangana Intermediate Board Updates : తెలంగాణలో జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీల పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
- Telangana Intermediate Board Updates : తెలంగాణలో జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీల పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
(1 / 5)
వేసవి సెలవుల పూర్తి తర్వాత తెలంగాణ లో జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు మార్చి 31 నుంచి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే.
(image source unshplash.com)(2 / 5)
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్, ఎయిడెట్, అన్ ఎయిడెట్, కో-ఆపరేటివ్, టీఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ, కేజీబీవీ, టీఎమ్ఆర్జేసీ, టీఎస్ మోడల్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో రెండేళ్ల ఇంటర్ కోర్సులు అందిస్తున్నారు. వీటిల్లో అడ్మిషన్లు పొందేందుకు 2024-25 విద్యాసంవత్సరానికి విద్యార్థుల నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు.
(image source unshplash.com)(3 / 5)
కళాశాలలో దరఖాస్తు స్వీకరణకు మే 31వ తేదీతో గడువు పూర్తి కానుంది.జూన్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
(image source unshplash.com)(4 / 5)
సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల షెడ్యూల్ త్వరలో విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్ తరగతులు జూన్ 01, నుంచి ప్రారంభం కానున్నాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. పాఠశాల అధికారులు జారీ చేసిన పాస్ సర్టిఫికేట్, ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, తాత్కాలిక టెన్త్ మార్కుల మెమో ఆధారంగా ప్రిన్సిపాల్స్ ఇంటర్ ప్రవేశాలు కల్పించవచ్చని తెలిపింది.
(image source unshplash.com)ఇతర గ్యాలరీలు