TS High Court On Raja singh Case: రాజాసింగ్‌ కేసులో పోలీసులకు హైకోర్టు నోటీసులు-ts high court notice to police over mla rajasingh pd act case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts High Court On Raja Singh Case: రాజాసింగ్‌ కేసులో పోలీసులకు హైకోర్టు నోటీసులు

TS High Court On Raja singh Case: రాజాసింగ్‌ కేసులో పోలీసులకు హైకోర్టు నోటీసులు

HT Telugu Desk HT Telugu
Sep 07, 2022 12:12 PM IST

TS High Court on Raja Singh Arrest : ఎమ్మెల్యే రాజాసింగ్​ పై పీడీ యాక్ట్ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులకు నోటిసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

పోలీసులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు
పోలీసులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు (tshc)

Telangana High Court Notice To Police:ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. పీడీ చట్టాన్ని వినియోగించి నిర్బంధించడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

గత నెల 25న రాజాసింగ్‌ను పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ రాజాసింగ్‌ భార్య ఉషాభాయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్‌ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. పలు కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేయడం అన్యాయమని ప్రస్తావించారు. రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు.

ఈ పిటిషన్ పై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్, జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కౌంటర్‌ దాఖలు కోసం ప్రభుత్వానికి నాలుగు వారాలు గడువిచ్చింది. విచారణను వాయిదా వేసింది.

రాజాసింగ్ అరెస్ట్ - ఏం జరిగిందంటే..

Raja Singh Arrest: రాజాసింగ్‌ను ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్(పీడీ యాక్ట్) కింద మంగళ్‌హాట్ పోలీసులు ఆగస్టు 25 వ తేదీన అరెస్టు చేశారు. చర్లపల్లిలోని సెంట్రల్ జైలుకు తరలించారు. షా ఇనాయత్‌గంజ్, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ పోలీసు అధికారుల బృందం గురువారం మధ్యాహ్నం మంగళ్‌హాట్‌లోని ఎమ్మెల్యే రాజాసింగ్ కార్యాలయానికి చేరుకుంది. సెక్షన్ 41 సీఆర్‌పీసీ కింద ఆయనకు పోటీలుసు నోటీసు ఇచ్చారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

పోలీసు రికార్డుల ప్రకారం 2004 నుండి రాజాసింగ్ పై మొత్తం 101 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 18 మతపరమైన నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్ననారు.

మహమ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సింగ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాతబస్తీలో 144 సెక్షన్ కూడా విధించారు. అక్కడక్కడా హింసాత్మక సంఘటనలు జరిగాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం