TS EAMCET - B : ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్... కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల-ts eamcet agriculture and medical counselling schedule 2023 relesed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eamcet - B : ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్... కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

TS EAMCET - B : ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్... కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 13, 2023 08:00 PM IST

TS EAMCET Agriculture and Medical Counselling: ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విడుదల చేశారు.

ఎంసెట్ బైపీసీ విద్యార్థుల‌కు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌
ఎంసెట్ బైపీసీ విద్యార్థుల‌కు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌

TS EAMCET Agriculture and Medical 2023: తెలంగాణలోని ఫార్మసీ, బ‌యోటెక్నాల‌జీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. తెలంగాణ ఎంసెట్ ద్వారా ప్రవేశాలు పొందాలనుకునేవారి కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.సెప్టెంబ‌ర్ 2, 3 తేదీల్లో బైపీసీ విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా.... B ఫార్మసీ, ఫార్మ్ డీ, ఫార్మాస్యూటిక‌ల్ ఇంజినీరింగ్, బ‌యో మెడిక‌ల్ ఇంజినీరింగ్, బ‌యోటెక్నాల‌జీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ముఖ్య తేదీలు:

స్లాట్ బుకింగ్ - సెప్టెంబర్ 2, 3 తేదీలు

ధ్రువపత్రాల పరిశీల - సెప్టెంబర్ 4, 5

వెబ్ ఆప్షన్లు - సెప్టెంబర్ 4 - సెప్టెంబర్ 7, 2023

సీట్ల కేటాయింపు - సెప్టెంబర్ 11వ తేదీన బీ ఫార్మ‌సీ, ఫార్మ్ డీ తొలి విడుత సీట్ల కేటాయింపు

తుది విడుత కౌన్సిలింగ్ - సెప్టెంబర్ 17, 2023

సెప్టెంబర్ 23న ఫార్మా, బ‌యోటెక్నాల‌జీ కోర్సుల‌్లో తుది విడుత సీట్ల‌ కేటాయింపు

సెప్టెంబ‌ర్ 24న స్పాట్ అడ్మిష‌న్ల మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌లవుతాయి.

ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష రాసిన వారిలో ఇంజినీరింగ్‌ విభాగంలో 80.33%, అగ్రికల్చర్‌లో 86.31% మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు.అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సులకు 94,614మంది దరఖాస్తు చేశారు. మరోవైపు ఇప్పటికే ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి.... మొత్తం 86,664 బీటెక్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్‌ కోటా కింద కౌన్సెలింగ్‌ ద్వారా 62,079 సీట్లను భర్తీ చేయనున్నారు. గత ఏడాది కన్వీనర్‌ కోటాలో 71,286 సీట్లు ఉండగా.. ఈసారి 9,207 తగ్గాయి. 137 ప్రైవేటు కాలేజీల్లో 80,091 ఇంజినీరింగ్ సీట్లు, 16 యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీల్లో 4,713 సీట్లు, 2 ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 1,302 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది రాష్ట్రంలో 176 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉండగా.. ఈసారి వాటి సంఖ్య 155కి తగ్గింది.

ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల….

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌ 2023 కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఐసెట్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు అధికారులు. ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.

ఇక అభ్యర్థులు ఆగస్టు 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలి. ఆగస్టు 25న ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలి. సెప్టెంబర్ 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.

సంబంధిత కథనం