Revanth reddy Padayatra : 25వ రోజుకు చేరిన రేవంత్ రెడ్డి పాదయాత్ర-today revanth reddy padayatra enter into koratla assembly constituency ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Today Revanth Reddy Padayatra Enter Into Koratla Assembly Constituency

Revanth reddy Padayatra : 25వ రోజుకు చేరిన రేవంత్ రెడ్డి పాదయాత్ర

Mar 11, 2023, 07:54 AM IST HT Telugu Desk
Mar 11, 2023, 07:54 AM , IST

  • Revanth reddy padayatra in Korutla: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 25వ రోజుకు చేరింది. శనివారం కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనుంది. ఈ మేరకు పలు గ్రామాల మీదుగా వెళ్లనున్న రేవంత్ రెడ్డి... రాత్రి కోరుట్లలో తలపెట్టిన సభలో పాల్గొంటారు.

ఇవాళ ఉదయం 09 గంటలకు ముత్యంపేటలోని షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం మెట్ పల్లిలోని పసుపు మార్కెట్ ను సందర్శిస్తారు. 

(1 / 5)

మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన వివరామం తర్వాత... సాయంత్రం 04 గంటలకు ధర్మారం జెండా ఆవిష్కరణ ఉంటుంది. ఐలాపూర్ లో సాయంత్రం 05 గంటలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలిస్తారు.  

(2 / 5)

శనివారం రాత్రి 07 గంటలకు కోరుట్లలోని అంబేడ్కర్ సర్కిల్ లో తలపెట్టిన జనసభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.  

(3 / 5)

పాదయాత్రలో భాగంగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై  కోపంతో BJP వైపు చూడొద్దని అన్నారు. పెనం మీద నుండి పొయ్యిలో పడొద్దన్న ఆయన... సేవ చేసుకునేందుకు ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని కోరారు.  

(4 / 5)

ధరణితో సమస్యలు ఎదుర్కుంటున్న రైతులకు అండగా నిలస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ హామీ కార్డు పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ లో ధరణి అదాలత్ నిర్వహించిన కాంగ్రెస్.... రైతులకి హామీ కార్డులు అందజేసింది.ధరణితో సమస్యలు ఎదుర్కుంటున్న రైతులకు అండగా నిలస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ హామీ కార్డు పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ లో ధరణి అదాలత్ నిర్వహించిన కాంగ్రెస్.... రైతులకి హామీ కార్డులు అందజేసింది.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు