Corona in Telangana | తెలంగాణలో కొత్తగా 374 కొవిడ్ కేసులు నమోదు, ఒకరు మృతి
రాష్ట్రంలో మంగళవారం 39,579 కరోనా టెస్టులు నిర్వహించగా కొత్తగా మరో 374 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఇంకా 1,193 టెస్టులకు సంబంధించిన రిపోర్ట్ వెయిటింగ్‌లో ఉంది.
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉంది. సాధారణ స్థాయిలోనే రోజూవారీ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో 5.77 కోట్లకు పైగా డోసుల వ్యాక్సినేషన్ వినియోగం జరిగినట్లు ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 2.6 కోట్లకు పైగా మంది ప్రజలు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు.
తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మంగళవారం 39,579 కరోనా టెస్టులు నిర్వహించగా కొత్తగా మరో 374 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఇంకా 1,193 టెస్టులకు సంబంధించిన రిపోర్ట్ వెయిటింగ్‌లో ఉంది. కరోనాతో పోరాడి ఈరోజు ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,110కి పెరిగింది. ఇక చికిత్స అనంతరం ఈరోజు మరో 683 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి 91 కేసులు ఉండగా.. రంగారెడ్డి నుంచి 39, మేడ్చల్ నుంచి 18, అలాగే నల్గొండ నుంచి 22, మంచిర్యాల నుంచి 19 చొప్పున కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 7 లక్షల 87 వేలకు పైగా కేసులు నమోదు కాగా, ఇందులో నుంచి 7 లక్షల 78 వేల మందికి పైగా రికవరీ అయ్యారు. కరోనా రికవరీ రేటు 98.91 శాతానికి మెరుగుపడింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా కరోనా కేంద్రాలలో లేదా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.