Telangana Inter Exams Updates : ఆ రోజు నుంచే ఫైనల్ ఎగ్జామ్స్..! తెలంగాణ ఇంటర్ పరీక్షలపై తాజా అప్డేట్ ఇదే
Telangana Inter Exams 2024 Updates: ఇంటర్ వార్షిక పరీక్షలపై దృష్టి పెట్టింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఈసారి తొందరగానే పరీక్షలను నిర్వహించాలని యోచిస్తోంది. ఫిబ్రవవరి 28వ తేదీ నుంచే ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు పంపగా.. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.
Telangana Inter Exams 2024 Updates:తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. వీలైనంత త్వరగా ఈసారి పరీక్షలను నిర్వహించాలని భావిస్తోంది ఇంటర్ బోర్డు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో పరీక్షలు, జవాబుపత్రాల మూల్యాంకనానికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అంచనా వేస్తోంది. అయితే ఈసారి కొంత ముందుగా పరీక్షలను ప్రారంభించాలని యోచిస్తోంది. అయితే ఇందుకు తగ్గటే కొన్ని ప్రతిపాదలను సిద్ధం చేసింది ఇంటర్. వీటిని సర్కార్ కు పంపగా… గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. రేపోమాపో అధికారికంగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 28 నుంచి..?
వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ రోజుతో ప్రారంభమై… మార్చి 18 వరకు పరీక్షలు జరిగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసి… సర్కార్ కు పంపింది. ఇందుకు సర్కార్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తుది షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో ఇంటర్‌బోర్డు అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారని సమాచారం. ఇక ప్రాక్టికల్స్ తో పాటు మరిన్ని వివరాలను కూడా ఇంటర్ బోర్డు ప్రకటించనుంది.
తొందరగా పరీక్షలను నిర్వహిస్తే... మూల్యాంకనం కూడా సులభంగా అవుతుంది, సిబ్బంది విషయంలో కూడా ఇబ్బందులు రావని భావిస్తోంది ఇంటర్ బోర్డు.గత విద్యా సంవత్సరం మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభయ్యాయి. కానీ ఈసారి ఫిబ్రవరి 28వ తేదీ నుంచి పరీక్షలు మొదలుపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక ఫిబ్రవరిలోనే ప్రాక్టికల్స్ ఉండే అవకాశం ఉంది.