తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అప్డేట్.. ఈసారి ముందుగానే ఫైనల్ ఎగ్జామ్స్ ..!
- Telangana Inter Exams 2024: ఇంటర్ వార్షిక పరీక్షలపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ఇంటర్ బోర్డు. గతేడాది మాదిరిగా కాకుండా.. ఈసారి తొందరగానే పరీక్షలను నిర్వహించాలని యోచిస్తోంది. మార్చి 1 నుంచి ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.

(1 / 5)
తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. వీలైనంత త్వరగా ఈసారి పరీక్షలను నిర్వహించాలని భావిస్తోంది ఇంటర్ బోర్డు.(tsbie.cgg.gov.in)
(2 / 5)
వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో పరీక్షలు, జవాబుపత్రాల మూల్యాంకనానికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అంచనా వేస్తోంది. అయితే ఈసారి కొంత ముందుగా పరీక్షలను ప్రారంభించాలని యోచిస్తోంది. (tsbie.cgg.gov.in)
(3 / 5)
తొందరగా పరీక్షలను నిర్వహిస్తే... మూల్యాంకనం కూడా సులభంగా అవుతుంది, సిబ్బంది విషయంలో కూడా ఇబ్బందులు రావని భావిస్తోంది.(tsbie.cgg.gov.in)
(4 / 5)
గత విద్యా సంవత్సరం మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభయ్యాయి. కానీ ఈసారి మార్చి 1వ తేదీ నుంచి పరీక్షలు మొదలుపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరిలోనే ప్రాక్టికల్స్ ఉండే అవకాశం ఉంది.(tsbie.cgg.gov.in)
ఇతర గ్యాలరీలు