Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బిగ్ అప్డేట్, లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్-వచ్చే వారం అందుబాటులోకి-telangana indiramma housing scheme beneficiary selection process new app for verify eligibility ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బిగ్ అప్డేట్, లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్-వచ్చే వారం అందుబాటులోకి

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బిగ్ అప్డేట్, లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్-వచ్చే వారం అందుబాటులోకి

Indiramma Housing Scheme Update : తెలంగాణ ప్రభుత్వం ఇందిమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక విధానంపై కసరత్తు చేస్తుంది. తాజాగా లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ లో కొన్ని మార్పులు చేసి, త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బిగ్ అప్డేట్, లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్-వచ్చే వారం అందుబాటులోకి

రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ ను రూపొందించామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రకటించారు. ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపిక పార‌ద‌ర్శకంగా ఉంటుంద‌ని, రాజ‌కీయ పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తామ‌న్నారు. ల‌బ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను శ‌నివారం ఆయన స‌చివాలయంలోని త‌న కార్యాల‌యంలో ప‌రిశీలించారు. ఈ యాప్‌లో ఒక‌టి రెండు మార్పు చేర్పుల‌ను మంత్రి సూచించారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచ‌న‌ల మేరకు యాప్‌లో మార్పులు చేసి వ‌చ్చే వారం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి... మాట్లాడుతూ కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకాన్ని ప్రారంభిస్తామ‌ని ప్రకటించారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు తుది ద‌శ‌కు చేరుకున్నాయ‌ని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజ‌ల‌ను దృష్టిలో ఉంచుకొని యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా చూడాల‌ని సూచించారు. లబ్దిదారుల ఎంపిక నుంచి ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేవ‌ర‌కు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వీలైనంత‌ వ‌ర‌కు వాడుకోవాల‌ని అధికారులకు సూచించారు. ఇండ్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమ‌న్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప‌నిచేయాల‌ని మంత్రి పొంగులేటి సూచించారు.

ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4000 ఇండ్లు

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నెలఖారులోనే అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఈనెల చివ‌రి నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడ‌తగా 3500 నుంచి 4000 ఇళ్లను మంజూరు చేయ‌బోతున్నామ‌ని ప్రకటించారు.

వ‌చ్చే నాలుగు సంవ‌త్సరాల‌లో తెలంగాణలో అర్హులైన పేద‌వారంద‌రికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడ‌మే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమ‌న్నారు. వచ్చే నాలుగు సంవ‌త్సరాల‌లో 20 ల‌క్షల ఇళ్లకు త‌గ్గకుండా నిర్మిస్తామ‌న్నారు. కులాలు, మ‌తాలు, ప్రాంతాలు, పార్టీలు, ఎలాంటి తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిర‌మ్మ ఇండ్లు ఇవ్వడ‌మే ఈ ప్రభుత్వ ఆశ‌య‌మ‌న్నారు. ఎలాంటి భేష‌జాల‌కు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావ‌ల‌సిన వాటా, నిధులు అడిగి తీసుకుంటామ‌న్నారు. అర్హుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు తావు లేకుండా ప్రక్రియను చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని భావిస్తోంది. ఈ స్కీమ్ అమలు కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

సంబంధిత కథనం