TG High Court Law Clerk Posts : తెలంగాణ హైకోర్టులో 33 లా క్లర్క్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్, ఇలా దరఖాస్తు చేసుకోండి
TG High Court Law Clerk Posts : తెలంగాణ హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన 33 లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 33 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. క్లర్క్ పోస్టులకు 3 లేదా 5 సంవత్సరాల లా డిగ్రీని కలిగిన అభ్యర్థులు అర్హులు. తెలంగాణహైకోర్టులో పనిచేసేందుకు 31 లా క్లర్క్‌లు, సికింద్రాబాద్ లోని స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో పనిచేసేందుకు 2 లా క్లర్క్‌ల పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక సంవత్సరం వ్యవధికి భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
లా క్లర్క్ పోస్టుల దరఖాస్తుకు అర్హతలు
- అభ్యర్థికి జులై 1 నాటికి 30 సంవత్సరాల వయస్సు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
- దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి.
- దరఖాస్తు దారుడు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీని పొంది ఉండాలి. 10+2 పూర్తి చేసిన తర్వాత 5 ఏళ్లు రెగ్యులర్ లా అభ్యసించాలి. లేదా 10+2 పాఠశాల విద్య తర్వాత మూడేళ్ల డిగ్రీ కోర్సు, ఆ తర్వాత 3 సంవత్సరాల రెగ్యులర్ లా డిగ్రీ పూర్తిచేయాలి.
- లా క్లర్క్ నోటిఫికేషన్ విడుదల తేదీకి రెండేళ్ల ముందుగా అభ్యర్థి న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులై ఉండాలి.
- అభ్యర్థి ఏ ఇతర అధ్యయన కోర్సు లేదా ఏదైనా ఇతర వృత్తి కొనసాగించకూడదు. లా క్లర్క్ గా విధులు నిర్వహించే సమయంలో తమ చదువు, ఇతర వృత్తులకు దూరంగా ఉండాలి.
- అభ్యర్థులు రిట్రీవల్‌తో సహా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. మనుపత్ర, ఎస్సీసీ ఆన్‌లైన్, లెక్సిస్‌నెక్సిస్, వెస్ట్‌లాపై అవగాహన కలిగి ఉండాలి.
- దరఖాస్తుకు సంబంధించిన ప్రోఫార్మా అధికారిక వెబ్‌సైట్ https://tshc.gov.in/ లో ఉంచారు.
- ఆఫ్ లైన దరఖాస్తులను "ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్" చిరునామాకు పంపించాలి. వయస్సు, వర్గం, విద్యార్హత రుజువుకు సంబంధిత పత్రాల కాపీలు జోడించాలి. అర్హతలు, అక్నాలెడ్జ్‌మెంట్ తో రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా హైకోర్టు అడ్రస్ కు నవంబర్ 23, 2024 సాయంత్రం 5.00 గంటల లోపు పోస్టు చేయాలి.
లా క్లర్క్ నోటిఫికేషన్ దరఖాస్తు ఫారమ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఐఐటీ హైదరాబాద్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో నాన్ - టీచింగ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. అక్టోబర్ 23 తేదీ నుంచే దరఖాస్తులు ప్రారంభం కాగా…డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం 05.00 గంటలతో దరఖాస్తు గడువు పూర్తి కానుంది. ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 31 ఖాళీలను రిక్రూట్ చేస్తారు. పీఆర్వో ఒక పోస్టు ఉండగా... ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు మూడు ఉన్నాయి. సూపరింటెండింగ్ ఇంజినీర్ - 1, టెక్నికల్ సూపరింటెండెంట్ - 1, స్టాఫ్ నర్స్ 05 పోస్టులు ఉన్నాయి. ఇక జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ పోస్టు ఒకటి ఉండగా... ఫిజియోథెరపిస్ట్ మరో పోస్టు ఉంది. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) విభాగంలో రెండు ఖాళీలు ఉండగా... అకౌంటెంట్ పోస్టులు రెండు ఉన్నాయి.
పోస్టును అనుసరించి అర్హతలను నిర్ణయించారు. దరఖాస్తులను కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https://iith.ac.in/careers/ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాత పరీక్ష ఉంటుంది. అంతేకాకుండా.. స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ పోస్టులన్నీ కూడా రెగ్యూలర్ బేస్ విధానంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుము కింద రూ. 500 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
సంబంధిత కథనం